నేర సమాచారం

ABN , First Publish Date - 2020-12-10T06:36:00+05:30 IST

అప్పుల బాధతో నాయిబ్రాహ్మణుడు వెంకటేశ్‌(24) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

నేర సమాచారం

 అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య 


రొద్దం, డిసెంబరు 9 : అప్పుల బాధతో నాయిబ్రాహ్మణుడు వెంకటేశ్‌(24) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ నారాయణ అందించిన వివరాల మేరకు మండల పరిధిలోని ఆర్‌.మరువపల్లిలోని బీసీ కాలనీలోని వెంకటేశ్‌ ఇల్లు కొనుక్కుని భార్య బిడ్డలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇల్లు కొనుగోలు కోసం చేసిన అప్పులు తీరక మనస్థాపానికి గురై స్వగృహంలో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ప్రత్యూష బాలింత కాగా తన పుట్టింటికి వెళ్లింది. తల్లి పనికోసం బెంగళూరు వెళ్లగా ఒక్కడే ఉంటూ మనస్థాపానికి గురైనట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


=============================================================


రెండు ద్విచక్రవాహనాలు ఢీ

ఒకరి మృతి - ముగ్గురికి గాయాలు 


గోరంట్ల, డిసెంబరు 9 : మండలంలోని జాతీయరహదారిలోని పాలసము ద్రం సమీపంలోని కోళ్లఫాం వద్ద బుధవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో తిమ్మప్ప(70) మృతి చెందాడు. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గా యపడ్డారు. లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన తిమ్మప్ప, వెంకటేశ్‌లు ద్విచక్రవాహనంలో పాలసముద్రానికి వస్తున్నారు.  మరో ద్విచక్రవాహనంలో పాలసముద్రం నుంచి పులేరుకు చెందిన అంజి, పాలసముద్రానికి చెందిన ఆంజనేయులు బెంగళూరు వైపు రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా హైవే ఆంబులెన్స్‌లో పెనుకొండ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిమ్మప్ప మృతిచెందాడు. వెంకటేశ్‌, అంజి, ఆంజనేయులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయనాయక్‌తెలిపారు.

==============================================================



పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్‌.. యువకుడి మృతి

కానిస్టేబుల్‌కు గాయాలు

కూడేరు, డిసెంబరు 9: మండలంలోని అరవకూరు సమీపంలోని జాతీయరహదారిపై ద్విచక్ర వాహనంలో వేగంగా వెళ్తు న్న యువకుడు ఎదురుగా వస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టి మృతి చెందాడు. బుధవారం జరిగిన ఘటనపై పోలీసులు తెలి పిన వివరాలివి. కర్ణాటక రాష్ట్రం శిరుగప్పకు చెందిన తేజసాయి (24) ద్విచక్ర వాహనంపై అనంతపురం మీదుగా బెంగళూరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో అరవకూరు దాటిన తర్వాత అనంతపురం నుంచి కూడేరుకు వస్తున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి అదిరాజ్‌సింగ్‌ రాణా ప్రయాణిస్తున్న వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో తేజసాయితో పాటు పోలీసు వాహనం లో ఉన్న కానిస్టేబుల్‌ జిలాన్‌కు గాయాలయ్యాయి. బాధితులను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, తేజసాయి అప్పటి కే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో పోలీ సు వాహనం పూర్తిగా దెబ్బతింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, ఆత్మకూరు సీఐ కృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-10T06:36:00+05:30 IST