నేర సమాచారం

ABN , First Publish Date - 2020-12-07T06:33:19+05:30 IST

అనంతపురం చెరువుకట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజీవరెడ్డి(50) అనే వ్యక్తి మృతిచెందాడు.

నేర సమాచారం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బుక్కరాయసముద్రం, డిసెంబరు 6: అనంతపురం చెరువుకట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజీవరెడ్డి(50) అనే వ్యక్తి మృతిచెందాడు. అనంతపురంపాతూరుకు చెందిన సంజీవరెడ్డి పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం సాయంత్రం చెరువుకట్టపై ఉన్న అయ్యప్పస్వామి గుడికి నడుచుకుంటూ వెళ్తుండగా తాడిపత్రి నుంచి అనంతపురానికి వస్తున్న కారు సంజీవరెడ్డిని ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సౌభాగ్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును సీజ్‌చేసినట్లు తెలిపారు.  


బావిలో పడి వృద్ధురాలు మృతి

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 6: మండల పరిధిలోని మార్లపల్లిలో ఆదివారం మతిస్థిమితంలేని మహిళ బావిలో పడి మృతిచెందింది.పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు...మార్నపల్లికి చెందిన నాగమ్మ(65) మతిస్థిమితంలేక  గ్రామంలో తిరుగుతూ ఉండేది. ఈ క్రమంలోని ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందింది. ఈమెకు పెళ్లికాలేదని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.



చికిత్స పొందుతూ ఒకరి మృతి

రాయదుర్గం రూరల్‌, డిసెంబరు 6: మండలంలోని కదరంపల్లికి చెందిన గురుస్వామి (42) ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి. గురుస్వామి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వుండేవాడు. దీంతో మనస్తాపం చెంది ఈనెల 2న ఇంట్లో ఎవరూలేని సమయంలో విషద్రావకం తాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు బాధితున్ని బళ్లారి విమ్స్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్సపొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ ఈరణ్ణ తెలిపారు.


విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌తో చీరల దుకాణం దగ్ధం

రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం

ధర్మవరంఅర్బన్‌, డిసెంబరు 6: పట్టణంలోని సుదర్శనకాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ద్వారకామయి శా రీశ్‌ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విద్యుత్‌షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల దుకాణంలోని చీరలన్నీ కాలిబూడిదయ్యాయి. దుకాణంలో మంటలు వ్యాపించడం గ మనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే దుకాణంలోని  చీరలు, సామాగ్రి, తదితర వస్తువులన్నీ తకాలిబూడిదయ్యాయి. గొట్లూరుకు చెందిన రామాంజినేయులుచీరల దుకాణం పెట్టి వ్యాపారం చేసుకునేవాడు. అగ్నిప్రమాదంతో దాదాపు రూ.50లక్షలవరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు.ప్రభుత్వం తనను ఆదుకోవాలని విన్నవించారు.

============================================================


లారీని ఢీకొన్నకారు - ఒకరి మృతి

సోమందేపల్లి(పెనుకొండ), డిసెంబరు 6 : సోమందేపల్లి మండలంలోని జా తీయరహదారి వైజంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పావగడకు చెందిన హిద యతుల్లా(32) మృతిచెందగా, మరో యువకుడు ఇమ్రాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పావగడకు చెందిన హిదయతు ల్లా, ఇమ్రాన్‌ కారులో బాగేపల్లిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి పావగడకు వస్తున్నారు. ఆదివారం ఉదయం వై జంక్షన్‌ వద్ద రోడ్డుపక్కన ఆగివున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆ ఇద్దరిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో హిదయతుల్లా మృతిచెందాడు. తీవ్రగాయాలైన ఇమ్రాన్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సీఐ శ్రీహరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ షర్ఫుద్దీన్‌ తెలిపారు. 


రూ.1.20 లక్షలు ఏమైనట్లు ? 

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హిదయతుల్లా జేబులో ఉన్న రూ.1.20 లక్షలు మాయమైనట్లు మృతుడి బంధువులు తెలిపారు. శనివారం రాత్రి బాగేపల్లిలోని అ తడి బంధువు రహీమ్‌  నుంచి అప్పుగా డబ్బు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆదివారం బంధువులు మృతుడి జేబులో పరిశీలించగా నగదు మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయంపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరుపుతామని పోలీసులు చెప్పినట్లు బంధువులు తెలిపారు. 


==============================================================


బైకును ఢీకొన్న కారు... ఒకరి మృతి

ముదిగుబ్బ, డిసెంబరు 6: మండల కేంద్రంలోని కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.... ముదిగుబ్బలో ఆశ్రమం వద్ద మహబూబ్‌పీరా(60) బైకులో వెళ్తుండగా అనంతపురం వైపు నుంచి వస్తున్న కారు డీకొంది. ఈ ప్రమాదంలో మహబూబ్‌పీరా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-07T06:33:19+05:30 IST