నేర సమాచారం

ABN , First Publish Date - 2020-11-26T06:48:57+05:30 IST

విద్యార్హత సర్టిఫికెట్లను స్నేహి తుడి నుంచి తెచ్చుకునేందుకు వెళ్తూ ఓ యువకుడు రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన సంఘటన మండలంలోని న్యామద్దెలలో బుధవారం చోటు చేసుకుంది.

నేర సమాచారం


రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


చెన్నేకొత్తపల్లి, నవంబరు 25: విద్యార్హత సర్టిఫికెట్లను స్నేహి తుడి నుంచి తెచ్చుకునేందుకు వెళ్తూ ఓ యువకుడు రోడ్డు ప్రమా దంలో మృతి చెందిన సంఘటన మండలంలోని న్యామద్దెలలో బుధవారం చోటు చేసుకుంది. హిందూపురం పట్టణం ముద్దిరెడ్డిపల్లికి చెందిన చిట్టెమ్మ, వెంకటేశ్వర్లు దంపతుల పెద్దకుమారుడు మధుసూదన్‌(19) ఇటీవలే డిప్లమా(పాలిటెక్నిక్‌) పూర్తి చేసుకున్నాడు. కొన్ని సర్టిఫికెట్లు స్నేహితుడి వద్ద ఉండటంతో వాటిని తెచ్చు కునేందుకు ద్విచక్రవాహనంలో సుబ్బరాయునిపల్లి గ్రామానికి బ యలుదేరాడు. న్యామద్దెల సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వ ద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొం ది. ఈ ప్రమాదంలో మధుసూదన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు  మధుసూదన్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 


శెట్టూరు మండలంలో...

శెట్టూరు, నవంబరు 25: మండలంలోని అడవి గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగంపల్లికి చెందిన కురుబ మల్లికార్జున (38) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. మల్లికార్జున ద్విచక్రవాహనంలో శెట్టూరు నుంచి స్వగ్రామం మంగం పల్లికి వెళుతుండగా అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. బాధితున్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్య  

కణేకల్లు, నవంబరు 25 : స్థానిక చేపలకాలనీకి చెందిన ఇదయతుల్లా (33) మంగళవారం రాత్రి ఉరేసుకున్నాడు. ఏఎ్‌సఐ ఈశ్వరప్ప తెలిపిన వివరాలివి. ఇదయతుల్లా మద్యానికి బానిస కావడంతో  భార్య సలీమాతో మనస్ఫర్తలు తలెత్తాయి. దీంతో భార్య మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి ఆమె వద్దకు వెళ్లిన ఇదయతుల్లా ఇంటికి రావాలని కోరినా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన ఇదయతుల్లా రాత్రి ఇంటికి వచ్చి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్‌ను ఢీకొని ఒకరి మృతి 

పెనుకొండ రూరల్‌, నవంబరు 25 : పట్టణంలోని ఆర్టీఓ చెక్‌పోస్టు సమీపంలో 44వ జాతీయరహదారిపై ద్విచక్రవాహనం డివైడర్‌ను ఢీకొ న్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యా యి. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామానికి చెందిన అన్నదమ్ములు సురేష్‌(35), కిషోర్‌లు కలిసి ద్విచక్రవాహనంలో పని నిమిత్తం పెనుకొండ నుంచి సోమందేపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీఓ చెక్‌పోస్టు సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్లను ఢీకొని బోల్తాపడ్డారు. ఈ ప్రమాదంలో సురేష్‌ అక్కడికక్కడే మృతిచెందగా కిషోర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108సాయంతో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.రైతు అనుమానాస్పద మృతి

శింగనమల, నవంబరు25: మండలంలోని పి.జలాలపురం గ్రామానికి చెందిన వృద్ధ రైతు మేకల నాగభూషణ(60) అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మండంలోని పి.జలాలపురం గ్రామానికి చెందిన రైతు మేకల నాగభూషణంకు మూడెకరాల పొలం ఉంది. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా గత ఏడాది ఒక కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వేరుశనగ పంట సాగుకోసం నాగభూషణం రూ.2.50 లక్షలు అప్పులు చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోవడంతొ. కుమారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం గ్రామానికి సమీపంలో మద్దిపల్లిగుట్ట వద్ద నాగభూషణం మృతదేహాన్ని గుర్తించారు. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


=========================================================


 

అనుమానంతో భార్యను చంపిన భర్త

శింగనమల, నవంబరు 25: మండలంలోని ఈస్టు నరసాపురం గ్రామానికి చెందిన ఇందిరమ్మ(36)ను భర్త ఓబుళనారాయణ అనుమానంతో హత్య చేశా డు. ఎస్‌ఐ మస్తాన్‌ తెలిపిన వివరాలు, మృతురాలు తండ్రి రుషింగప్ప ఫిర్యాదు మేరకు.. ఈస్టు నరసాపురం గ్రామానికి చెందిన ఓబుళనారాయణతో తాడిపత్రికి చెందిన ఇందిర మ్మకు 18 సంవత్సరాలు కిందట వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పదేళ్ల కిందట మనస్పర్థల వల్ల విడిపోయారు. గత నెలలో గ్రామ పెద్దలు పంచాయితీ చేసి, ఇందిరమ్మను కాపురానికి పంపారు. భార్య అక్రమ సం బంఽధాలు కొనసాగిస్తుందనే అనుమానంతో ఓబుళనారాయణ ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరు పిల్లలు ఓ గదిలో పడుకోగా... వెనుక గదిలో పడుకున్న భార్య ఇందిరమ్మను ఓబుళనారాయణ పథకం ప్రకారం సుత్తితో మోదీ హత్య చేశాడు. అనంతరం నేరుగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి  లొంగిపోయాడు. ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఎస్‌ఐ మస్తాన్‌  సంఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిం గనమల ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


==============================================================


తల్లిదండ్రులు మందలించారని కుమారుడి ఆత్మహత్య

సెల్‌ఫోన్‌ చూడొద్దనటమే కారణం

ధర్మవరంఅర్బన్‌, నవంబరు 25: సెల్‌ఫోన్‌ చూ డొద్దని తల్లిదండ్రులు మందలించారని కుమారుడు బుధవారం చెరువులో పడి, ఆత్మహత్య చేసుకున్నా డు. పట్టణానికి చెందిన రంగనాథ్‌, సుజాతల కుమారుడు రాజేశ్‌(21) స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు మగ్గం నేస్తూ జీ వనం సాగించేవారు. రాజేశ్‌ ఇంటిలో తరచూ సెల్‌ఫోన్‌ చూస్తుండటంతో ఇది మంచి పద్ధతి కాదని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేశ్‌ బుధవారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో మృతదేహం తేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి, మృతదేహాన్ని బయటకు తీశారు. చెరువు కట్టపై ఉన్న సెల్‌ఫోన్‌ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు చెరువు కట్ట వద్దకు వచ్చి, కుమారుడి శవాన్ని చూసి బోరున విలపించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.


===========================================================


గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య 

గోరంట్ల, నవంబరు 25: మండలంలోని గు మ్మయ్యగారిపల్లికి చెందిన హరిజన మేకలచంద్రశేఖర్‌(32) చాకుతో గొంతు కోసుకుని బు ధవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రం గప్ప తెలిపిన సమాచారం మేరకు చంద్రశేఖర్‌కు చాలాకాలంగా మానసిక స్థితి సరిగాలేదన్నారు. భార్య రాధమ్మ, పిల్లలు, చరణ్‌తేజ్‌, లిఖితలతో కలిసి ఆరేళ్లుగా బెంగళూరు వెళ్లి కూలీ పనులు చేసి జీవించేవాడన్నారు. రెండేళ్లుగా భార్య భర్తలమధ్య మనస్పర్థలు రాగా చంద్రశేఖర్‌ స్వగ్రామానికి రా గా భార్య, పిల్లలను తీసుకొని గోరంట్ల మండలంలోని పుట్టినిల్లయిన జక్కసము ద్రం వెళ్లి ఉంటోందన్నారు. అనారోగ్యంతో, భార్యలేని ఎడబాటుతో జీవితంపై వి రక్తి చెంది గ్రామ చివర ఆదినారాయణరెడ్డి పొలంలో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. సీఐ జయనాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

==============================================================


 

కెనడా నుంచి స్వగృహానికి ప్రణయ్‌ మృతదేహం

అనంతపురం క్రైం, నవం బరు 25: ప్రేమ విఫలమవటంతో కెనడాలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్‌ (29) దే హం నగరంలోని స్వగృహానికి బుధవారం చేరింది. 12 రోజుల తరువాత మృతదేహం ఇంటికి చేరింది. తల్లిదండ్రులు, కుటుం బ సభ్యులు, బంధువులు.. ప్రణయ్‌ మృతదేహంపై పడి బోరున విలపించారు. ప్రణయ్‌ మృతికి కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్‌ చేశారు. అనంతరం వారి స్వగ్రామమైన నార్పల మండలం గడ్డంనాగేపల్లిలో అంత్యక్రియలు చేశారు.
నూర్పిడి యంత్రంలో పడి రైతు మృతి

నల్లమాడ, నవంబరు 25: మండలంలోని మసకవంకపల్లి గ్రామానికి చెందిన రైతు చాకిలేటి రాము (56) బుధవారం సాయంత్రం ప్రమాదవ శాత్తూ వరినూర్పిడి మిషన్‌లో పడి మృతి చెందాడు. మృతుడి కుమారుడు వెంకటేష్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉ న్నాయి. మంగళవారం వరి పంటను కూలీలతో కోయించి, సమీపంలోని బండమీదకు తరలించారు. బుధవారం వరిపంటను నూర్పిడి మిషన్‌లో వేస్తుండగా బుధవారం సాయంత్రం ప్రమాదవ శాత్తూ కాలుజారు మిషన్‌లో పడి మృతి చెందినట్లు కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఏఎ్‌సఐ వజదుల్లా సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించి కేసు నమోదు చేసి, రైతు మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతిడికి భార్య అంజిన మ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బంధువులు, గ్రామస్థులు కోరారు. 

============================================================

Updated Date - 2020-11-26T06:48:57+05:30 IST