-
-
Home » Andhra Pradesh » Ananthapuram » crime news
-
నేర సమాచారం
ABN , First Publish Date - 2020-11-25T06:50:29+05:30 IST
వేర్వేరు కారణాలతో మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు. కదిరి మండలం మూలపల్లి తండాకు చెందిన శంకరప్ప, లేపాక్షి గోవిందరాజులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
వేర్వేరు కారణాలతో మంగళవారం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్ప డ్డారు. కదిరి మండలం మూలపల్లి తండాకు చెందిన శంకరప్ప, లేపాక్షి గోవిందరాజులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కదిరిఅర్బన్, నవంబరు 24 : మండలంలోని మూలపల్లితండాకు చెం దిన శంకరప్ప (62) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్‌ఐ రమణ తెలిపిన వివరాల మేరకు మూలపల్లితండాకు చెందిన శంకరప్ప తన ఇంటి వెనుక వైపు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. తన భర్త ఆత్మహత్యకు ఆయన అన్నదమ్ములే కారణమని మృతుడి భార్య అంజినమ్మ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
లేపాక్షి: స్థానిక లేపాక్షి పాత మసీదు దగ్గర గోవిందరాజులు(36) మంగళవారం రాత్రి తన ఇంటిలో ఉరివేసుకుని మృతిచెందాడు. సంచార జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవలే లేపాక్షిలో అద్దె ఇంటిలో చేరాడు. మృతునికి భార్య రాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. లేపాక్షి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
========================================================
రోడ్డు ప్రమాదంలో పాలవ్యాపారి మృతి
రాయదుర్గం రూరల్, నవంబరు 24 : మండలంలోని ఆవులదట్ల సమీపంలో చర్చి వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో రాయదుర్గానికి చెందిన పాలవ్యాపారి షఫీవుల్లా (69) మృతి చెందాడు. సీఐ ఈరణ్ణ తెలిపిన వివరాలివి. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన షఫీవుల్లా పలు గ్రామాలకు పాల పాకెట్లు తీసుకెళ్లి అమ్మకాలు సాగిస్తుండేవాడు. ఈక్రమంలో రాయదుర్గం వైపు ద్విచక్రవాహనంలో వస్తుండగా కొరియర్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తహసీల్దార్ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ శ్రీనివాసరాజు కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.
======================================================

చెట్టుకొమ్మ పడి కూలీ మృతి
సోమందేపల్లి(పెనుకొండ), నవంబరు 24 : మండల కేంద్రమైన సోమందేపల్లిలో అయ్యప్పస్వామి దేవాల యం వద్ద చెట్టుకొమ్మపడి రాఽధాకృష్ణ (60)అనే కూలీ మృతిచెందాడు. మంగళవారం సాయం త్రం గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి కొత్తగా నిర్మిస్తున్న ఇంటి స్థలంలో ఉన్న చెట్టును తొలగించడానికి సజ్జరాయప్పకు విక్రయించాడు. రాధాకృష్ణ చెట్టును కొడుతుండగా చెట్టుకొమ్మ అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
