ఏపీఎల్‌ విజేత రాప్తాడు జట్టు

ABN , First Publish Date - 2020-12-30T06:14:54+05:30 IST

అనంత ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ విజేతగా రాప్తాడు జట్టు నిలిచింది.

ఏపీఎల్‌ విజేత రాప్తాడు జట్టు

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 29: అనంత ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌ విజేతగా రాప్తాడు జట్టు నిలిచింది. కొవిడ్‌-19 లాక్‌డౌన్‌తో అర్ధాంతరంగా ముగిసిన ఏపీఎల్‌ క్రికెట్‌ పోటీలు తిరిగి ప్రారంభం కాగా ఫైనల్స్‌లో రాప్తాడు, అంతపురం జట్లు తలపడ్డా యి. మొదట బ్యా టింగ్‌ చేసిన అనంతపురం జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో 31.1ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. రాప్తాడు బౌలర్‌ జీవన్‌సాహిత్‌ 5 వికెట్లు తీసి అనంత నడ్డి విరిచాడు. రాప్తాడుజట్టు మొదటి ఇన్నింగ్స్‌ 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 445 పరుగులు చేసింది. దత్తారెడ్డి 259 బంతుల్లో 24 ఫోర్లు, 17 సిక్స్‌లతో 266 పరుగులతో డబుల్‌సెంచరీ కొట్టాడు. దీంతో రాప్తాడు 268భారీ పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ చేజెక్కించుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛోఫెర్రర్‌ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మ్యాన్‌ఆ్‌ఫది సిరీ్‌సగా హరినాథ్‌, మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా డబుల్‌సెంచరీ సాధించిన దత్తారెడ్డికి బహుమతులు ప్ర దానం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రా రంజీ జట్టు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ షాబుద్దీన్‌, రంజీ మాజీ క్రీడాకారుడు సురేష్‌, జిల్లా క్రికెట్‌సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పగడాల మల్లికార్జున, మధుసూదనాచారి, ఏపీఎల్‌ చైర్మన్‌ చంద్రమోహన్‌రెడ్డి, కోచైర్మన్‌ రవికాంత్‌, సభ్యులు జొన్నా జయప్రకాష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2020-12-30T06:14:54+05:30 IST