అంతర్రాష్ట్ర సరిహద్దు ఎందుకు తేల్చటం లేదు?
ABN , First Publish Date - 2020-12-17T06:07:34+05:30 IST
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను పదేళ్లయి నా తేల్చకపోవడం వెనుక అంతర్యమేంటని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు ప్రశ్నించారు.

సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు
అనంతపురం టౌన్, డిసెంబరు 16: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను పదేళ్లయి నా తేల్చకపోవడం వెనుక అంతర్యమేంటని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఓబులు ప్రశ్నించారు. బుధవారం స్థానిక గణేనాయక్‌భవన్‌లో నిరర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 కిలోమీటర్లున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను గుర్తించేందుకు గడిచిన పదేళ్లలో మూడుసార్లు సర్వేలు చేసినా తేల్చలేకపోవడం అనేక సందేహాలకు తావిస్తోందన్నారు. సర్వే ఆఫ్ ఇండియా కూడా గడిచిన 53 రోజులుగా సర్వేలు చే పట్టి ఆరు పాయింట్ల వద్ద తేల్చలేకపోయినట్లు తెలుస్తోందన్నారు. ఈ ప్రాంతాల్లోనే ఇనుప ఖనిజం నిలువలున్నాయని పేర్కొన్నారు. 2008లో గాలి జనార్ధన్‌రెడ్డి మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ సాగుతోందన్నారు. అక్రమాలు తేలాలంటే సరిహద్దుల గుర్తింపు పూర్తయితేనే తేలుతాయని వివరించారు. ఈ అక్రమాలు తేల్చకుండా జాప్యం చేయడంలో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒత్తిడి మేరకు సరిహద్దుల గుర్తింపులో జాప్యం జరుగుతోందా..! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలున్నవారు తమ పార్టీవారైతే ఒకరకంగా, మరొకరైతే మరోరకంగా బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జిల్లాల విభజన సమయంలోనున్న మ్యాపుల ఆధారంగా సరిహద్దులను తక్షణం గుర్తించాలని డిమాండ్ చేశారు. గాలి జనార్ధన్‌రెడ్డి కేసు విచారణను వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమం లో సీపీఎం జిల్లా ఉత్తరప్రాంత కార్యదర్శివర్గ సభ్యుడు నల్లప్ప పాల్గొన్నారు.