హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్న బీజేపీ

ABN , First Publish Date - 2020-12-21T05:15:03+05:30 IST

దేవాలయాలను రా త్రి సమయాల్లో ధ్వం సం చేయించి, పగటిపూట ధర్నాలు చేస్తూ హిందూ సెం టిమెంట్‌ను బీజేపీ రెచ్చగొడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ విమర్శించారు.

హిందూ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్న బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న జగదీష్‌

సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 20: దేవాలయాలను రా త్రి సమయాల్లో ధ్వం సం చేయించి, పగటిపూట ధర్నాలు చేస్తూ హిందూ సెం టిమెంట్‌ను బీజేపీ రెచ్చగొడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ విమర్శించారు. ఆదివారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. జగదీష్‌ మాట్లాడుతూ రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వంటి సున్నితమైన అంశాలను రెచ్చగొడుతూ హిందూ సెంటిమెంట్‌ ద్వారా బలపడిన బీజేపీ.. ఏపీలో పురాతన దేవాలయాలను రాత్రి వారి దుండగుల ద్వారా పగుల గొట్టించి, పగటిపూట ధర్నాలు చేస్తోందన్నారు. ఇతర మతాలపై ద్వేషం రగిల్చి, పబ్బం గడుపుకోవాలని కుట్రలు చేస్తోందన్నారు. మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేయాలని కుతంత్రాలు రచిస్తోందన్నారు. ఇది తగదని హితవు పలికారు.


నేటి నుంచి ఆందోళనలు

2018, 2019, 2020 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి రైతులకు రావాల్సిన పంటనష్టపరిహారం, బీమా సొమ్ము వెంటనే ఖాతాల్లో జమ చేయాలని జిల్లావ్యాప్తంగా టీడీపీ, సీపీఐఎంఎల్‌, కాంగ్రెస్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమొక్రసీతో కలిసి ఆందోళనలు చేపట్టాలని తీర్మానించినట్లు జగదీష్‌ తెలిపారు. 21, 22, 23 తేదీల్లో మొదటి విడతగా సచివాలయాల వద్ద, 28, 29, 30 తేదీల్లో మండల కార్యాలయాల్లో ఆందోళనలు చేపడతామన్నారు. స మావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌, కార్యదర్శివర్గసభ్యులు రాజారెడ్డి, మ ల్లికార్జున, వేమయ్యయాదవ్‌, సంజీవప్ప, కార్యవర్గసభ్యులు శ్రీరాములు, కాటమయ్య, లిం గమయ్య, గోవిందు, పెదయ్య, రంగయ్య, నారాయణస్వామి, జింకా చలపతి, పద్మావతి, ఆంజనేయులు, సూర్యనారాయణరెడ్డి, అల్లీపీరా, జయలక్ష్మి, వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-21T05:15:03+05:30 IST