కలెక్టర్‌కు కొవిడ్‌-19 పరీక్ష

ABN , First Publish Date - 2020-04-24T10:12:53+05:30 IST

కలెక్టర్‌ గంధం చం ద్రుడు గురువారం ఉదయం తన క్యాం పు కార్యాలయం లో కొవిడ్‌-19

కలెక్టర్‌కు కొవిడ్‌-19 పరీక్ష

నెగిటివ్‌గా నిర్ధారణ


అనంతపురం, ఏప్రిల్‌ 23  (ఆంధ్రజ్యోతి) :  కలెక్టర్‌ గంధం చం ద్రుడు గురువారం ఉదయం తన క్యాం పు కార్యాలయం లో కొవిడ్‌-19 పరీక్ష చే యించుకున్నారు. నెగిటివ్‌గా నిర్ధారణ కాగా, విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. అనుమానం ఉన్న ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా శాంపిల్స్‌ ఇచ్చి పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా కరోనా పరీక్షలకు ముందు కు రావాలన్నారు. తమ కుటుంబంతో పాటు ఇతరులకు కరోనా వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తగా పరీక్ష చేయించుకోవడమన్నది బాధ్యతగా గుర్తెరగాలన్నారు. కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలందరూ సహకారమివ్వాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-04-24T10:12:53+05:30 IST