రామరాజుపల్లిలో దంపతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-09-12T09:23:55+05:30 IST
మండలంలోని రామరాజుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలు, పంటలు పండకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది దంపతులు భోగాతి బయపరెడ్డి(28), అనూష(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకు

పామిడి, సెప్టెంబరు 11: మండలంలోని రామరాజుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలు, పంటలు పండకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది దంపతులు భోగాతి బయపరెడ్డి(28), అనూష(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి రామరాజుపల్లిలో చోటుచేసుకుంది.
యాడికి మండలం పీ వెంగన్నపల్లి గ్రామానికి చెందిన శివారెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమార్తె అనూషను రామరాజుపల్లికి చెందిన బోగాతి బయపురెడ్డికి ఇచ్చి 6 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. బయపరెడ్డి 5 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న కుమార్తె పూజితకు లక్షలు వెచ్చించి వైద్యం చేయించారు. ఆర్థిక సమస్యలు అధికం కావడంతో మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగారు. గుర్తించిన బంధువులు వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా అనూష మార్గమధ్యంలో చనిపోయింది.
ఇక భర్త బయపరెడ్డి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.