మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సిలింగ్‌ నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-12-25T07:05:25+05:30 IST

ఎస్‌జీటీలకు మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సిలింగ్‌కు అనుమతించాలని ఫ్యాప్టో జిల్లా మాజీ అధ్యక్షుడు బీకే ముత్యాలప్ప డిమాండ్‌ చేశారు.

మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సిలింగ్‌ నిర్వహించాలి

ఫ్యాప్టో, ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ నాయకుల డిమాండ్‌

ధర్మవరంఅర్బన, డిసెంబరు 24: ఎస్‌జీటీలకు మాన్యువల్‌ పద్ధతిలో కౌన్సిలింగ్‌కు అనుమతించాలని ఫ్యాప్టో జిల్లా మాజీ అధ్యక్షుడు బీకే ముత్యాలప్ప డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు  ఉపాధ్యాయుల న్యా యమైన డిమాండ్ల సాధన కోసం స్థా నిక ఎ మ్మార్సీ కార్యాలయం ఎదుట గురువారం ఫ్యాప్టో, ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీకేముత్యాలప్ప మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో బ్లాక్‌ చేసిన పోస్టుల ను చూపించాలని, ఛైల్డ్‌ఇన్ఫోలో మాధ్యమంమార్పు వల్ల కోల్పోయిన పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశా రు. ఈ ధర్నాలో ఏపీటీఎఫ్‌ పట్టణ అ ధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవీంద్రారెడ్డి, నాగప్ప, రూరల్‌ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు శంకరనారాయణ, క్రిష్ణమూర్తి, యూ టీఎఫ్‌ పట్టణ శాఖ పట్టణ, ప్రధానకార్యదర్శులు ఆదిరెడ్డి, లక్ష్మీనారాయణ, ఫ్యాప్టో కార్యకర్తలు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులు, పోతలయ్య పా ల్గొన్నారు.

Updated Date - 2020-12-25T07:05:25+05:30 IST