కంగారు అవసరం లేదు

ABN , First Publish Date - 2020-04-01T09:52:27+05:30 IST

కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని లాక్‌డౌన్‌ పర్యవేక్షణ కోసం జి ల్లాకు వచ్చిన ప్రత్యేకాధికారి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బాబురావునాయు డు పేర్కొన్నారు.

కంగారు అవసరం లేదు

ప్రత్యేకాధికారి బాబురావు నాయుడు 


హిందూపురం టౌన్‌, మార్చి 31: కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని లాక్‌డౌన్‌ పర్యవేక్షణ కోసం జి ల్లాకు వచ్చిన  ప్రత్యేకాధికారి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బాబురావునాయు డు పేర్కొన్నారు. హిందూపురం, లేపాక్షిలో రెండు పాజిటివ్‌ కేసులు న మోదైన నేపథ్యంలో మంగళవారం ఆయన హుటాహుటిన హిందూపురం చే రుకున్నారు. క్వారంటైన్‌ వార్డులో అందుతున్న అత్యవసర సేవలపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఆర్‌ఎంఓలను ఆరాతీశారు. క్వారంటైన్‌ వార్డులో ఎంతమం ది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.


అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హిందూపురంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో ఇక్కడి వైద్య బృందా న్ని అప్రమత్తం చేయడానికి వచ్చానన్నారు. అలాగే ఆస్పత్రిలో సదుపాయాలు గుర్తించి.. అవసరమైన పరికరాలు త్వరితగతిన అందించేందుకు ప్రభు త్వం దృష్టికి తీసుకెళతామన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కూడా మెరుగైన వైద్యం అందించి త్వరితగతిన నయం అయ్యేవిధంగా ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దివాకర్‌, సూపరింటెండెంట్‌ కేశవులు, ఆర్‌ఎంఓ రుక్మిణమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-01T09:52:27+05:30 IST