హై అలర్ట్‌ ఏదీ ?

ABN , First Publish Date - 2020-03-21T10:29:55+05:30 IST

కరోనా ప్ర కంపనలు జిల్లా ప్రజానీకాన్ని భయకంపితులను చేస్తున్నా యి. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కట్ట డికి పకడ్బంధీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యం త్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ మేరకు ప్రజల్లో న మ్మకాన్ని కలిగించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి.

హై అలర్ట్‌ ఏదీ ?

జిల్లాకు 600 మంది దాకా విదేశాల నుంచి రాక

హోమ్‌ ఐసోలేషన్‌పై కొరవడిన నిఘా

నిర్బంధపు ఉత్తర్వులతో సరి

బయట తిరుగుతుండటంతో స్థానికుల్లో ఆందోళన 

సెలవుల నేపథ్యంలో నగరం విడిచి గ్రామాలకు పరుగులు

జిల్లా ప్రజలను భయపెడుతున్న కరోనా


అనంతపురం,మార్చి20(ఆంధ్రజ్యోతి) : కరోనా ప్ర కంపనలు జిల్లా ప్రజానీకాన్ని భయకంపితులను చేస్తున్నా యి. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, కట్ట డికి పకడ్బంధీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా యం త్రాంగం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ మేరకు ప్రజల్లో న మ్మకాన్ని కలిగించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. ఇందుకు ప్రధాన కారణం విదేశాల నుంచి జిల్లా కు వచ్చిన వారిపై నిఘా కొరవడటమే.  విద్యాసంస్థలు, దేవాలయాలు, సినిమాహాళ్లు, పర్యాటక ప్రాంతాలను మూ సివేయడంతో సరిపెట్టుకుంటున్నారే తప్పా.... విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు వివిధ దేశాల నుంచి 600 మంది దాకా వచ్చారు. వారందరినీ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే వారిపై ప్రత్యేక నిఘా ఉంచకపోవడంతో స్వేచ్ఛగా బయట తిరుగుతుండ టంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


చివరికి వారి వారి కు టుంబసభ్యుల్లోనూ అదే అభద్రతాభావం నెలకొంది.  పొరుగు రాష్ట్రం తెలం గాణలో 7 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  ఆ పరిస్థితిని తలుచుకుం టూ జిల్లా ప్రజానీకంలో సైతం అలజడి రేగుతోంది. ఈ అభద్రతా భావాన్ని తొలగించాలంటే జిల్లా యంత్రాంగం మరింత పటిష్టంగా పనిచేయాల్సి ఉంది. ఎవరైతే విదేశాల నుంచి జిల్లాకు వచ్చారో వారి కోసం ప్రత్యేకంగా ఒక నిఘా బృందం నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రా యం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్వేచ్ఛగా వదిలేస్తే తమ పరిస్థితేంటన్న వాదన స్థానిక ప్రజల నుంచి వినిపిస్తోంది. 


 ఉత్తర్వులతోనే సరి

కరోనా ప్రభావం నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉంటూ జిల్లాకు దాదాపు 600 మంది దాకా వచ్చారు. వీరందరినీ 28 రోజుల హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు. దాదాపు 300 మంది ఆ పీరియడ్‌ను పూర్తి చేసుకున్నారు. మిగి లిన వారికి హోమ్‌ ఐసోలేషన్‌ పీరియడ్‌ కొనసాగుతున్నట్లు వైద్యవర్గాల ద్వారా అందిన సమాచారం. మరికొందరికి 14 రోజులు ఇంటి నుంచి బయటకు రాకుండా జిల్లా యం త్రాంగం నిర్బంధపు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు స్థానిక అధికారులు నిర్బంధపు ఉత్త ర్వులు విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి అంద జేశారు.  అయితే 14 రోజులు వారు బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జిల్లాలో మాత్రం నిర్బంధపు ఉత్తర్వులతోనే సరిపెడుతున్నారు.  నగరం విడిచి గ్రామాలకు పరుగులు....


జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, ప్రైవేట్‌ హాస్టళ్లు ఈ నెల 31 వరకూ బంద్‌ చేయడంతో విద్యార్థులు స్వగ్రామాలకు పరుగులు తీశారు. చదువు దేవుడెరుగు... ముం దు కరోనా తగలకుంటే చాలనే ఆతృత ఆ విద్యార్థుల్లో కనిపించింది. దీంతో అనంతపురం నగరం నుంచే వేలాది మంది విద్యార్థులు వారి వారి స్వగ్రా మాలకు వెళ్లిపోవడంతో నగరంలోని హాస్టళ్లు, అద్దె గదులు ఖాళీగా దర్శన మిస్తున్నాయి. అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. 


అధికారుల్లో అప్రమత్తత అవసరం

కరోనా ఆనవాళ్లు జిల్లాలో కనిపించకుండా ఉండాలంటే అధికారులు మ రింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు చర్యలు శరవేగంగా కొనసాగించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ విషయంలో కఠిన నిర్ణయాలకు వెనకడుగు వేయకూడదనే వాదన అన్ని వర్గాల ప్రజల నుంచి వినిపిస్తోంది. ఎవరైతే విదేశాల నుంచి జిల్లాకు వచ్చారో.... వారి హోమ్‌ ఐసోలేషన్‌ పీరియడ్‌ పూర్తి చేసుకునే విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు వివిధ పట్టణాల్లోని పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు, రెస్టారెంట్లు, లాడ్జిలు, గ్రాండ్‌ హోటళ్లలో శానిటైజర్‌ పటిష్టంగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం ఈ విషయంలో మరింత సీరియస్‌గా వ్యవహ రించాల్సి ఉంది.  

Updated Date - 2020-03-21T10:29:55+05:30 IST