ఇళ్లకు పంపించండి

ABN , First Publish Date - 2020-04-26T11:06:56+05:30 IST

‘మాకు అన్నం వద్దు. ఇళ్లకు పంపించండి’ అంటూ క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులు నిరసనకు దిగారు.

ఇళ్లకు పంపించండి

టీటీడీసీ క్వారంటైన్‌లో అనుమానితుల నిరసన

సీఆర్‌ఐటీ నుంచి 60 మందికి విముక్తి


అనంతపురం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) :  ‘మాకు అన్నం వద్దు. ఇళ్లకు పంపించండి’ అంటూ క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులు నిరసనకు దిగారు. ఈ సంఘటన శనివారం జిల్లా కేంద్రంలోని రాప్తాడు పంగల్‌ రోడ్డు సమీపంలో గల టీటీడీసీ క్వారం టైన్‌ వద్ద జరిగింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయి నవారిని గుర్తించి టీటీడీసీ క్వారంటైన్‌కు తరలించారు. వారందరికీ శాంపిళ్లు తీసి వ్యాధి నిర్దారణ పరీక్షలు చేశా రు. రెండుసార్లు తీయగా... రెండుసార్లు వారికి నెగిటివ్‌ వచ్చింది. ఇప్పటికే వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చి 15 రోజులు దాటిపోయింది. దీంతో సహనం కోల్పో యిన వారు నెగిటివ్‌ వచ్చినా ఎందుకు ఇళ్లకు పంపించరు అంటూ శనివారం అధికారుల తీరుపై నిరసనకు దిగారు. టీటీడీసీ క్వారంటైన్‌ ఆరుబయట కూర్చొని నిరసన చేపట్టారు. 


మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ నిరసన కొనసాగించారు. చివరకు కొందరు అధికారులు అక్కడికి చేరుకుని తప్పకుండా ఇళ్లకు పంపిస్తామని కలెక్టర్‌ అనుమ తి రావాల్సి ఉందని సముదాయించారు. దీంతో నిరసనకారులు కొంత శాంతిం చారు. బళ్లారి బైపాస్‌ నందుగల సీఆర్‌ఐటీ క్వారంటైన్‌ నుంచి శనివారం దాదాపు 60 మందిని ఇళ్లకు పంపిం చారు.  ఐదు గురిని మాత్రం అక్కడే ఉంచుకున్నారు. వారందరికీ వివిధ కార ణాలతో మరోసారి శాంపిల్‌ తీసి పరీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత నెగిటివ్‌ వస్తే వాళ్లను ఇంటికి పంపిస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-04-26T11:06:56+05:30 IST