యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-12-30T06:15:54+05:30 IST

మండలంలోని గన్నెవారిపల్లిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం నిర్ధారించారు.

యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌

తాడిపత్రి, డిసెంబరు 29: మండలంలోని గన్నెవారిపల్లిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం నిర్ధారించారు. ఆమె ఈ నెల 24న యూకే నుంచి వచ్చారని, రెండురోజుల క్రితం కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. ప్రస్తుతం అమె హోం క్వారంటైన్‌లో ఉన్నారన్నారు. మరోసారి బుధవా రం పరీక్షలు జరిపి కొత్త స్ర్టెయిన్‌ వైరస్‌ ఉందా అన్నది నిర్ధారిస్తామన్నారు. ప్రస్తుతం అమెకు ఎలాంటి కరోనా బాధిత లక్షణాలు లేవని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-30T06:15:54+05:30 IST