నార్పల మండలానికి పాకిన కరోనా

ABN , First Publish Date - 2020-04-26T11:01:57+05:30 IST

అనంతపురం పార్లమెంటు పరిధిలో ఎక్కడా కరోనా కేసులు వెలుగు చూసినా జిల్లా సర్వజనాస్పత్రి లింకులు కనిపిస్తున్నాయి.

నార్పల మండలానికి పాకిన  కరోనా

 హృద్రోగంతో జిల్లా ఆస్పత్రిలో ఓ వ్యక్తి చికిత్స

వైద్యం అందించిన డాక్టర్‌కు పాజిటివ్‌

మృతి చెందిన హృద్రోగి.. రాపిడ్‌ కిట్స్‌తో పరీక్షలు

 పాజిటివ్‌గా నిర్ధారణ, ఆయన భార్యకు కూడా... 

అధికారులు అప్రమత్తం... ఐసొలేషన్‌కు తరలింపు


అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 25 : అనంతపురం పార్లమెంటు పరిధిలో ఎక్కడా కరోనా కేసులు వెలుగు చూసినా జిల్లా సర్వజనాస్పత్రి లింకులు కనిపిస్తున్నాయి.  తాజాగా జిల్లా సర్వజనాస్పత్రి కరోనా ప్రభావం నార్పల మండలానికి పాకినట్లు తెలుస్తోంది. నార్పల మండలం మాలవాండ్లపల్లికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి శనివారం చని పోయారు. ఈయన కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాడు. ఇటీవల జిల్లా ఆస్పత్రిలో  చికిత్స పొందాడు. ఈ వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్‌, నర్సు కరోనా బారిన పడ్డారు. దీంతో అధికారులు వివరాలు సేకరించి మాలగుండ్లపల్లికి చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లి బయట తిరగవద్దని ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఆ మేరకు  ఆ వ్యక్తి కుటుంబం ఇంటి వద్దనే ఉంటూ వస్తోంది. అ యితే శనివారం చికిత్స పొందిన గుండె సంబంధిత వ్యాధి వ్యక్తి చనిపోయాడు.


అధికారులు వైద్యులను తీసుకెళ్లి రాపిడ్‌ కిట్స్‌తో మృతదేహానికి పరీక్షలు చేయించారు.  పా జిటివ్‌ వచ్చింది. తర్వాత మృతుడి భార్యకు పరీక్షలు చే యగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. దీంతో అప్రమత్తమైన స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు విషయం తెలిపారు. వెంటనే చని పోయిన వ్యక్తి భార్యతో పాటు కుటుంబసభ్యులు, ఇప్పటి వరకూ ఆ ఇంటితో కలిసి మెలిసి తిరిగిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించే చర్యలు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి భార్యను, కుటుంబసభ్యులను ఐసొ లేషన్‌కు తరలిం  చారు. ఇక్కడ మరొక్కసారి శాంపిల్‌ తీసి వైద్యకళాశాల ల్యాబ్‌కు పంపించనున్నారు. అక్కడ పరీక్షల తర్వాత రిపో ర్ట్‌ రావాల్సి ఉంటుంది. దీంతో ఆ కుటుంబసభ్యులు, కలిసిన వారితో పాటు అధికారుల్లోనూ టెన్షన్‌ నెలకొంది. 

Updated Date - 2020-04-26T11:01:57+05:30 IST