జర్నలిస్టులకు కరోనా బీమా వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2020-07-19T10:47:06+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులకు కరోనా బీమా వర్తింపజేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు.. ప్రభుత్వాన్ని

జర్నలిస్టులకు కరోనా బీమా వర్తింపజేయాలి

కలెక్టర్‌కు ఏపీయూడబ్ల్యూజే నాయకుల వినతి


అనంతపురం అర్బన్‌, జూలై 18: కరోనా వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులకు కరోనా బీమా వర్తింపజేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు.. ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌ గంధం చంద్రుడును కలసి, వినతిపత్రం అందజేశారు. ఏ పీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షకార్యదర్శులు లక్ష్మీనారాయణ, శ్రీనివా్‌సరెడ్డి మా ట్లాడుతూ పలువురు జర్నలిస్టులు కరోనా వైరస్‌ బారిన, ముగ్గురు మరణించటం బాధాకరమన్నారు.


వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్టు నేతలు కేపీకుమార్‌, సంతో్‌షరెడ్డి, చౌడప్ప, మల్లికార్జునశర్మ పాల్గొన్నారు. కాగా అంతకుమందు కరోనాతో మృతిచెందిన జర్నలిస్టులకు స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సంతాపసభ నిర్వహించారు. మృతులకు ఘన నివాళులర్పించారు. యాడికిలో తహసీల్దార్‌ బాలమ్మకు జర్నలిస్టు నేతలు వినతిపత్రం అంద జేశారు.


తలుపుల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పాత్రికేయులు ధర్నా నిర్వ హించారు. తహసీల్దార్‌ శ్రీనివాసగౌడ్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.  ఓబుళదేవరచెరువులో డీటీ నట్‌రాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జర్నలిస్టు ఆత్మకు శాంతి కలగాలని రెండు నిముషాలు మౌనం పాటించారు.

Updated Date - 2020-07-19T10:47:06+05:30 IST