మరో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2020-05-10T11:04:08+05:30 IST

జిల్లాలో మరో ము గ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హిందూ పురంలో ఇద్దరికి, మడకశిరలో ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. హిందూపురం

మరో ముగ్గురికి కరోనా

మడకశిరలో  ఓ మహిళ, హిందూపురంలో ఇద్దరికి నిర్ధారణ

జిల్లాలో 129కి చేరిన కేసుల సంఖ్య


అనంతపురం వైద్యం, మే 9 : జిల్లాలో మరో ము గ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  హిందూ పురంలో ఇద్దరికి, మడకశిరలో ఒకరికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. హిందూపురం ముక్కిడిపేటకు చెందిన వృద్ధుడు(70) లక్ష్మీవెంకటేశ్వర మెడికల్స్‌ ఎంఎఫ్‌ రోడ్డుకు చెందిన వ్యక్తి(49) ఉన్నారు. తొలిసారిగా మడక శిర ప్రాంతంలో కరోనా కేసు నమోదైంది. మడకశిర ఆరేపేటకు చెందిన 28 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకింది.  హిందూపురానికి దగ్గరలో ఉన్న మడకశిరలో కరోనా కేసు నమోదు కావడం స్థానికులు, అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 126 కేసులు నమోద వగా ఇందులో జిల్లా వాసులు 99 మంది, గుజరాతీలు 26 మంది, ఒకరు కర్ణాటకకు చెందిన వారు ఉన్నారు. తాజా గా మూడు కేసులతో బాధితుల సంఖ్య 129కి పెరిగింది. 

Updated Date - 2020-05-10T11:04:08+05:30 IST