631 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-08-11T11:46:50+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్‌ బులెటిన్‌లో 631 మందికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు.

631 మందికి కరోనా

24738కి చేరిన బాధితులు... ఐదుగురి మృతి 

మొత్తం మరణాలు 175..


అనంతపురం వైద్యం, ఆగస్టు 10: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్‌ బులెటిన్‌లో 631 మందికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు. దీంతో బాధితుల సంఖ్య 24738కి చేరింది. వీరిలో 17597 మంది కోలుకోగా.. మిగతావారు వైరస్‌తో పోరాడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐదుగురు కరోనాతో మృతిచెందారు. దీంతో వైరస్‌ మరణాల సంఖ్య 175కి చేరింది.


నేడు 20 ప్రాంతాల్లో శాంపిళ్ల సేకరణ 

జిల్లాలో మంగళవారం 20 ప్రాంతాలలో శాంపిళ్లు సేకరిస్తామని కలెక్టర్‌ తెలిపారు. వెస్ట్‌నరసాపురం, కురుకుంట్ల, ఆకులేడు, లోలూరు, చుక్కలూరు, రాయలచెరువు, గార్లదిన్నె, నార్పల, కళ్యాణదుర్గం, కదిరి, హిందూపురం, ధర్మవరం, తాడిపత్రి, పుట్టపర్తి, గుంతకల్లు, గుత్తి, జిల్లాకేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల, పాతూరు ఆస్పత్రి, ఆర్ట్స్‌ కళాశాల, రుద్రంపేట ప్రాంతాల్లో శాంపిళ్లు తీసుకుంటామన్నారు.


1479 మంది డిశ్చార్జ్‌ 

ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కోలుకున్న 1479 మంది కరోనా బాధితులను సోమవారం డిశ్చార్జ్‌ చేసినట్టు కలెక్టర్‌  గంధం చంద్రుడు తెలిపారు.

Updated Date - 2020-08-11T11:46:50+05:30 IST