కరోనా@203
ABN , First Publish Date - 2020-05-24T08:52:10+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు రెండు వందలు దాటాయి. శనివారం 9 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య 203కి ..

జిల్లాలో పెరుగుతున్న కేసులు
తాజాగా 9 మందికి పాజిటివ్
అనంతపురం వైద్యం, మే23: జిల్లాలో కరోనా కేసులు రెండు వందలు దాటాయి. శనివారం 9 కేసులు నమోదవటంతో మొత్తం కేసుల సంఖ్య 203కి చేరింది. ఇందులో 175మంది జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన 28 మంది ఇతర రాష్ట్రాల వారు. ఈనెల 16వ తేదీ వరకూ జిల్లావాసులు 122 మంది, గుజరాతీలు 26 మంది, కర్ణాటక, జార్ఖండ్‌కు చెందిన ఒక్కొక్కరు కరోనా బారిన పడ్డారు. అప్పటి వరకూ అధికారులు కూడా కరోనా కేసుల బులెటిన్ విడుదల చేశారు. ఈ లెక్కన జిల్లాలో 150 కరోనా కేసులు చూపుతూ వచ్చారు. 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ జిల్లాలో కేసులు నమోదు కాలేదని బులెటిన్‌లో చూపారు.
20వతేదీ నుంచి జిల్లాలో కేసుల సమాచారం చూపట్లేదు. రాష్ట్రస్థాయి బులెటిన్ మాత్రమే ప్రకటిస్తున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసుల వ్యవహారం గందరగోళంగా మారింది. జిల్లాలో తొలిరోజుల కన్నా ప్రస్తుతం కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా యి. అధికారుల లెక్కల ప్రకారం ఈనెల 20వ తేదీ నుంచి 53 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటికి జిల్లావాసులు 166 మంది కరోనా బారినపడ్డారు. శనివారం మరో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో హిందూపురంలో 6, గోరంట్లలో 2, పెనుకొండలో ఒక కేసు నమోదైనట్లు తెలిసింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలకు కరోనా ఎక్కువగా సోకుతున్నట్లు తెలుస్తోంది.
మరో ఆరుగురు డిశ్చార్జ్
జిల్లాలో కరోనా నుంచి కోలుకుని మరో ఆరుగురు డిశ్చార్జ్ అయినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉరవకొండ నియోజకవర్గం బీ కొత్తకోట, హావళిగి గ్రామానికి చెందిన ఆరుగురి ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేశారు. వారికి ఒక్కొక్కరికి రూ.2 వేలు ప్రభుత్వ సాయం అందించారు. ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపినట్లు తెలిపారు.
తనకల్లులో మరో డ్రైవర్‌కు కరోనా
తనకల్లు, మే 23 : మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో కాపురం ఉన్న మరో డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఎస్ఐ రంగడు శనివారం రాత్రి తెలిపారు. గత 15 రోజులుగా క్వారంటైన్లో ఉన్న అతడిని పరీక్షిం చగా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో అతడిని అనంతపు రం తరలించనున్నట్లు తెలిపారు. తనకల్లులో మరో డ్రైవ ర్కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలలో భయాందో ళనలు నెలకొన్నాయి. అధికారులు, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించే అవకాశం ఉంది.