అనంతపురం జిల్లాలో మళ్లీ వెయ్యి దాటిన కేసులు.. కొత్తగా ఎన్నంటే..

ABN , First Publish Date - 2020-08-20T18:55:21+05:30 IST

జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. వారం రోజులుగా జిల్లాలో కేసుల సంఖ్య..

అనంతపురం జిల్లాలో మళ్లీ వెయ్యి దాటిన కేసులు.. కొత్తగా ఎన్నంటే..

3160కి చేరిన మొత్తం బాధితులు

మరో 8మంది వైరస్‌తో మృతి

మొత్తం మృతులు 246


అనంతపురం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. వారం రోజులుగా జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. మూడు రోజులుగా భారీగా తగ్గినట్లు బులిటెన్‌లో చూపించారు. నమూనాల సేకరణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు తగ్గించడం వల్లే జిల్లాలో కేసులు తగ్గాయని విమర్శలు వచ్చాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఏది నిజం.. కేసులు తగ్గాయా.. తగ్గిస్తున్నారా అంటూ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించిన బులిటెన్‌లో ఒక్క రోజులో జిల్లాలో 1123 మందికి కరోనా సోకింది. ఈ లెక్కన జిల్లాలో కరోనా కేసులు 31630కి చేరాయి. 8మంది కరోనా బాధితులు మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 246కి పెరిగింది. మొత్తం బాధితుల్లో 25794 మంది కోలుకోగా, 5590మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో బుధవారం కరోనా నమూనాల సేకరణ, వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచారు.

Updated Date - 2020-08-20T18:55:21+05:30 IST