-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Corn purchases are closed
-
మొక్కజొన్న కొనుగోళ్లు బంద్
ABN , First Publish Date - 2020-12-30T07:05:17+05:30 IST
మొక్కజొన్న రై తుకు మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొ నుగోళ్లు చేస్తామని ప్రభుత్వ ఆర్భాటంగా ప్రకటనతో ప్రారంభించి చేతులేత్తేశారు.

కేంద్రాల వద్ద రైతుల నిరసన
ప్రైవేట్ మార్కెట్‌లో దిగజారుతున్న ధరలు
హిందూపురం, డిసెంబరు 29: మొక్కజొన్న రై తుకు మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొ నుగోళ్లు చేస్తామని ప్రభుత్వ ఆర్భాటంగా ప్రకటనతో ప్రారంభించి చేతులేత్తేశారు. ఈనేపథ్యంలో మంగళవారం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి పంట కొనుగోళ్లు బంద్‌తో ఆందోళన చెందాల్సివస్తోంది. పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన రైతులు పడిగాపులు కాయాల్సివస్తోంది. మంగళవారం లేపాక్షి మండలంలో రైతులు కొనుగోళ్లు కేంద్రాల వద్ద నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతుకు మద్దతు క్వింటాల్ ధర రూ.1850 కల్పిస్తూ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నవంబరు 3నుంచే మార్క్‌ఫెడ్ ద్వా రా ఆర్బీకేలో కొనుగోళ్లు నవంబర్‌లో కొనుగోళ్లు ప్రా రంభించిన సంగతి తెలిసిందే. టార్గెట్ పూర్తి అయ్యిందన కొనుగోళ్లు బంద్ చేశారు. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు బం ద్‌తో రైతులు ఆందోళన చెందాల్సివస్తోంది. రైతులు ఈక్రాప్ చేసుకుని రిజిస్ర్టేషన చేసుకున్న ప్రతి రైతు పంటను కొనుగోళ్లు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నిలిపివేడంతో రైతులు మండిపడుతున్నారు. లేపాక్షి కొను గోలు కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టగా వారితో తహసీల్దార్ బలరాం వచ్చి మాట్లాడి మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళతామన్నారు.
ప్రతిపాదనలు పంపాం: పరమేశ్వరన, డీఎం, ఏపీ మార్క్‌ఫెడ్
జిల్లా వ్యాప్తంగా 20222 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాం. ప్రతిపాదన చేసిన కొనుగోళ్లు టార్గెట్ పూర్తి అయ్యింది. ఇంకా 7035 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లు ప్రతిపాదన పం పాం. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, మార్కెఫెడ్‌పై అధికారులకు నివేదిక పంపాం. అనుమతి రాగానే తిరిగి కొనుగోళ్లు ప్రారంభిస్తాం.