కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్నివర్గాల సహకారం
ABN , First Publish Date - 2020-03-27T09:39:22+05:30 IST
రోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.
ప్రజాక్షేత్రంలోకి ప్రజాప్రతినిధులు
90 శాతం మంది స్వీయ నియంత్రణలోనే
జిల్లా సరిహద్దుల్లో పూర్తిస్థాయిలో నిఘా
సామాజిక దూరం పాటించేలా...
ఎక్కడికక్కడ అదనపు మార్కెట్‌లు ఏర్పాటు
క్షేత్రస్థాయిలో కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణ
కరోనా సమాచారం
అడ్మిషన్‌లో ఉన్నవారు : 9 మంది
శాంపిల్స్ సేకరణ : 14 మంది
పాజిటివ్ కేసులు : లేవు
నెగిటివ్ కేసులు : 07
రిపోర్ట్స్ పెండింగ్ : 07
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు : 1015 మంది
ఇప్పటి వరకూ గుర్తించినది : 838 మంది
హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నవారు : 838 మంది
గుర్తించని వారు : 177 మంది
14 రోజులు పర్యవేక్షణలో ఉన్నవారు : 655 మంది
28 రోజులు పర్యవేక్షణలో ఉన్నవారు : 93 మంది
28 రోజులు పూర్తి చేసుకున్న వారు : 90 మంది
అందుబాటులో ఉన్న మాస్క్‌లు(ఎన్-95) : 500
పీపీ కిట్స్ : 60
మాస్క్‌లు : 1100
గ్లౌజ్‌లు : 1500 జతలు
అనంతపురం,మార్చి26(ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఇం టి నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. 90 శాతం మంది స్వీయ నియంత్రణలోనే ఉన్నారు. మిగిలిన 10 శాతం మంది మాత్రమే ఎలాంటి పని లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు. అవసరమైన మేరకు అవగాహన కల్పించడానికే మొగ్గు చూపుతున్నారు. వినని పక్షంలో ప్రజాశ్రేయస్సు దృష్ట్యా లాఠీకి పని చెబుతున్నారు.
మరోవైపు ఆశా వర్కర్‌లు, నర్సులు వైద్య ఉద్యోగులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్ బారి నుంచి రక్షించుకోవాలంటే ఇంటి నుంచి బయటికిరాకూడదని చెబుతూనే వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. అంతటితో ఆగక విదేశాల నుంచి ఎవరెవరు వచ్చారో వారి ఇళ్లకు వెళ్లి స్వీయ నియంత్రణ పాటించాలని, లేని పక్షంలో క్వారంటైన్‌కు తరలించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్ర జాప్రతినిధులు సైతం ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, అనంతపురం అ ర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా వారి వారి నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తూ ప్రజలకు కరోనా వైర్‌సకు సంబంధించి అవగాహన కల్పించారు.
లా క్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో, హిందూపురంలో పర్యటించారు. ఎస్పీ తాడిప త్రి, ఉరవకొండ, గుంతకల్లులో పర్యటించారు. లాక్‌డౌన్‌లో భాగంగా గురువారం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు సైతం నిర్మానుష్యమయ్యాయి. కాగా కరో నా వైరస్ అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా గురువారం ఒక్కరోజే ఐదు కేసులు నమోదు కావడం గమనార్హం.
గ్రామాల సరిహద్దులు బంద్- యువత నాకాబందీ
కరోనా వైరస్ నుంచి తమ గ్రామాల ప్రజలను రక్షించుకునేందుకు గ్రామ సరిహద్దుల బంద్ కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో పలు గ్రామాల యువత తమ గ్రా మాలకు సరిహద్దు రోడ్లన్నింటికి కంపకొట్టి కొత్త వ్య క్తులెవరూ గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటు న్న వి షయం తెలిసిందే. తాజాగా ముదిగుబ్బ, తనక ల్లు, శె ట్టూరు మండలం లక్ష్ముంపల్లి, శింగనమల, గార్లదిన్నె, బ త్తలపల్లి తదితర మండలాల్లోని వివిధ గ్రా మాల ప్ర జలు వారి వారి గ్రామాల సరిహద్దుల రోడ్లన్నీ ముళ్లకంపలతో బంద్ చేశారు. గతంలో ప్లేగు, కలరా, మసూచి వచ్చిన సందర్భాల్లో పరిస్థితిని గ్రామ పెద్దలు గుర్తుచేస్తున్న నేపథ్యంలో యువత ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలోనూ నిఘా పటిష్టంగా కొనసాగుతోంది. బెంగళూరు, బళ్లారి, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల నుంచి జిల్లాలోకి ఎవరూ రాకుండా చెక్‌పోస్టు లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం జిల్లాలోకి ఎవరిని ప్రవేశించకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది.
సామాజిక దూరమే ధ్యేయంగా
లాక్‌డౌన్ అమల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కూరగా యలు, నిత్యావసర వస్తువులు, పాలు కొనుగోలు కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిం దే. ప్రజలు ఒక్కసారిగా మార్కెట్లకు వెళ్లడంతో సామా జిక దూరం పాటించలేదు. జిల్లాలోని అన్ని మున్సి పాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో కలెక్టర్ గంధం చంద్రుడు అన్ని మున్సిపాలిటీల్లోనూ అదనంగా మార్కెట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతపురం నగరంలో 7 ప్రాంతాల్లో మార్కెట్ సౌకర్యం కల్పించారు. ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ అదనపు మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్ లో భాగంగా ప్రజలు ఇంటికే పరిమితమైన నేపథ్యం లో మార్కెట్లలోనూ సామాజిక దూరాన్ని పాటిస్తే... కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చన్న అభిప్రాయం అటు ప్రజల్లోనూ ఇటు యంత్రాంగంలో నూ నెలకొనడం శుభపరిణామం.