ఆర్థిక లోటున్నా పథకాలు కొనసాగింపు

ABN , First Publish Date - 2020-12-30T07:02:19+05:30 IST

రాష్ట్రం ఆర్థికలోటులో ఉన్నా సంక్షేమ పథకాలు ఆగడకుం డా ముందుకు తీసుకెళ్తున్న ఘనత జగనమోహనరెడ్డిదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు

ఆర్థిక లోటున్నా పథకాలు కొనసాగింపు

మంత్రి శంకరనారాయణ

పరిగి(హిందూపురం టౌన), డిసెంబరు 29 : రాష్ట్రం ఆర్థికలోటులో ఉన్నా సంక్షేమ పథకాలు ఆగడకుం డా ముందుకు తీసుకెళ్తున్న ఘనత జగనమోహనరెడ్డిదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. మంగళవారం పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో కొడిగెనహళ్లిలో ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ ఏడాదిన్నర్ర కాలంలో 90శాతం హామీలు నెరవేర్చామని రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులున్నా ఏ ఒక్క పథకం కూడా ఆగలేదన్నారు. మహిళలకు సం క్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న ఘనత జగనదేనన్నారు. 


కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం 

హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలను తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని మంత్రి శంకరనారాయణ అన్నారు. మంగళవారం పరిగి మండలంలో గొరవనహళ్లి చెరువులో జలహారతి నిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీరిచ్చి సస్యశ్యామలం చేస్తామని అందుకు ముఖ్యమంత్రి కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ నిషాంతి, తహసీల్దార్‌ సౌజన్య, ఎంపీడీఓ రామారావు, హౌసింగ్‌ డీఈ నాగరాజు, ఏఈ శ్రీనివాస్‌, ఏపీఎం దేవానందం, వైసీపీ నా యకులు మాలగుండ్ల రవీంద్ర, కన్వీనర్‌ జయరాం, రమణ, మారుతిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T07:02:19+05:30 IST