కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, శాంపిల్‌ టెస్టింగ్‌లు పక్కాగా సాగాలి

ABN , First Publish Date - 2020-04-26T11:09:32+05:30 IST

జిల్లాలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, శాంపిల్‌ కలెక్షన్‌, టెస్టింగ్‌లు పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు.

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, శాంపిల్‌ టెస్టింగ్‌లు పక్కాగా సాగాలి

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం

హిందూపురానికి 6 వేల పీపీఈ కిట్లు

క్వారంటైన్‌ కేంద్రాల ఇన్‌చార్జ్‌గా ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌


అనంతపురం,ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, శాంపిల్‌ కలెక్షన్‌, టెస్టింగ్‌లు పక్కాగా జరగాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని ఆర్డీఓలు, తహ సీల్దార్‌లు, వైద్యాధికారులు, పోలీసు అధికారులు, మొబైల్‌ టెస్టింగ్‌ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ వందశాతం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, శాంపిల్‌ సేకరణ, టెస్టింగ్‌ జరగాలన్నారు. ఇందుకు సం బంధించి రికార్డుల నిర్వహణలో వైద్యాధికారులు, రెవెన్యూ, పోలీసుల మధ్య సమన్వయం లేదన్నారు. అందరి వద్ద ఒకే సమాచారం ఉండేలా చూడాలన్నారు. పాజిటివ్‌ కేసు లు నిర్ధారణ అయిన 12 గంటల్లోపు అందుకు సంబంధిం చిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు చెందిన వ్యక్తులను గుర్తించాలన్నారు. ఆ వివరాలను త్వరగా పూర్తిచేసి సం బంధిత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.


అలా చేసిన ప్పుడే కరోనా వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టేందుకు వీలుంటుందన్నారు. ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తులను తప్పని సరిగా క్వారంటైన్‌ కేంద్రాల్లోనే ఉంచాలన్నారు. మొబైల్‌ వాహనాల ద్వారా సేకరించిన శాంపిల్స్‌ను ఆన్‌లైన్‌లో ఒక విధంగా, భౌతికంగా మరో రకంగా పంపిస్తుండటంతో సం బంధిత ల్యాబ్‌ల్లో శాంపిల్స్‌ తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఒకే విధంగా ఉండేలా చూడాలన్నారు. హిందూపురానికి ప్రత్యేకంగా 6 వేల పీపీఈ కిట్లను పంపిస్తున్నామన్నారు. వాటిని రెడ్‌జోన్‌ లోని ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్‌లు, గ్రామ, వార్డు కార్య దర్శులు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందికి అందిం చాలన్నారు. రెడ్‌జోన్ల ప్రాంతానికి రెండు కి.మీ దూరంలో కూరగాయల షాపులను ఏర్పాటు చేయాలని ఆయన సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో సైతం నిత్యావసర దుకాణాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. హిందూపురం రెడ్‌జోన్‌లోని 4 వేల కుటుంబాలకు ఫ్రూట్‌ కిట్లను అందించాలని ఉద్యానశాఖ డీడీని కలెక్టర్‌ ఆదేశించారు.


హిందూపురంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు ఇ న్‌చార్జ్‌గా ధర్మవరం మున్సిపల్‌ కమిషనర్‌ను నియమించా మన్నారు. ఆ కేంద్రాల్లోని ముస్లింలు రంజాన్‌ ఉపవాస దీక్షలు చేస్తున్నందున దీక్ష అనంతరం వారికి బిర్యానీ, డ్రైఫ్రూట్‌లను పంపిణీ చేయాలని కమిషనర్‌ను ఆదేశిం చారు. ఇవి ఇతర కేంద్రాల్లో సైతం ఏర్పాటు చేయాల్సింది గా జేసీ-2 రామ్మూర్తిని ఆయన ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జేసీ ఢిల్లీరావు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రశాంతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, డీఎ్‌ఫఓ జగన్నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-26T11:09:32+05:30 IST