ఏకవీర...

ABN , First Publish Date - 2020-04-07T09:49:18+05:30 IST

జిల్లాలో కోవిడ్‌-19పై కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా

ఏకవీర...

అంతా తానై వ్యవహరించిన కలెక్టర్‌

శాఖాధికారుల నోళ్లకు తాళం

మంత్రులు సైతం మౌనం

క్షేత్రస్థాయి అధికారులతో ఆరా తీయని వైనం

కరోనాపై సమీక్ష తీరిదీ...


అనంతపురం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కోవిడ్‌-19పై కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు అంతా తానై వ్యవహరించాడు. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను గణాంకాలతో మంత్రులకు వివరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సమావేశంలో వివిధ శాఖల అధికారుల నోళ్లకు తాళం పడిందనే చెప్పాలి. సమీక్షకు హా జరైన వైద్యఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణలు కలెక్టర్‌ నివేదికలను ఆల కించడంతోనే సరిపెట్టినట్లు సమాచారం.


మంత్రులు సై తం మౌనం పాటించారన్నది అక్కడ జరిగిన సమావేశం తీరును బట్టి తేటతెల్లమవుతోంది. కోవిడ్‌-19 నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ విదే శాల నుంచి జిల్లాకొచ్చిన వారిలో 155 మంది అడ్రస్సులు గల్లంతయ్యాయి. వారు ఎవరు... ఏ ప్రాంతంలో ఉంటు న్నారో ఇప్పటికీ గుర్తించలేదు. ఎవరికి వారు హోమ్‌ క్వారంటైన్‌లో గోప్యంగా ఉంటే పర్వాలేదు... వారంతా ప్రజ ల్లో తిరుగుతుంటే పరిస్థితులు చేజారే అవకాశాలు ఉన్నా యి. మక్కాకు వెళ్లొచ్చిన వారితో పాటు వారితో కాంటా క్ట్‌లో ఉన్నవారికే జిల్లాలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికే పాజిటివ్‌ కేసుల సంఖ్య జిల్లాలో 6కు చేరుకుంది. అందులో ఒకరు చనిపోయారు. మరోవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన జమాతేకు వె ళ్లొచ్చిన వారు దాదాపు 70 మందికిపైగానే ఉన్నారు. వారు జిల్లాకొచ్చిన తరువాత ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారో ఇ ప్పటికీ లెక్క తేలలేదు. అధికారులు మాత్రం మక్కా, ఽఢిల్లీకి వెళ్లొచ్చిన వారిని, వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారం దరికి పరీక్షలు నిర్వహించామంటున్నారు.


నెగిటివ్‌ రావ డంతో తిరిగి ఇళ్లకు పంపామని చెబుతున్నారు. అలా పరీ క్ష నిర్వహించడం, ఇలా ఇంటికి పంపేయడంతోనే సరి పెడుతున్నారు తప్ప నాలుగైదు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచలేకపోతున్నారు. పాజిటివ్‌ వ్యక్తులను ప్రత్యేకంగా ఉంచకుండా ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే ఉంచడంతో కాన్పు కోసం వచ్చే మహిళలతో పాటు వివిధ రోగాలతో ఓపీకి వచ్చే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాజిటివ్‌ కేసులకు సంబంధించిన వ్యక్తుల బంధువులు, సన్ని హితులు సైతం ఆస్పత్రిలోనే కలియతిరుగుతుండటంతో ప్రజలే కాకుండా ఆస్పత్రి సిబ్బందిలో సైతం ఆందోళన కలుగుతోంది. జిల్లాలో మూడు కోవిడ్‌ ఆస్పత్రులను ఎం పిక చేశారు.


ఆ ఆస్పత్రులను ఇప్పటి వరకూ వినియోగిం చుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రిలో 50 పడకలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో కనిపించలేదు.  ఎక్కడికక్కడ ప్రభుత్వాస్పత్రుల్లో క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్న వైద్యులు, నర్సులకు ఎన్‌-95 మాస్క్‌లు, గ్లౌజులు, పీపీఈ కిట్స్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు  పడుతు న్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసే వై ద్యులు, సిబ్బందికి కూడా సౌకర్యాలు కల్పించలేదంటే జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పాజిటివ్‌ కేసులకు హిందూపురం కేంద్రంగా మారింది. అక్కడ పని చేసే వైద్యసిబ్బందికి కనీస సౌకర్యాలు లేకపోవడం పరిస్థి తికి అద్ధం పడుతోంది. మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో శాంపిల్‌ తీసుకుని పరీక్షలు నిర్వహించి నప్పటికీ నివేదికలు వెల్లడించడంలో జాప్యం జరుగుతోం ది. నివేదికలు బయటపెట్టడంలోనూ దాగుడుమూతలా డుతున్నారు. మరి సమీక్షలో ఈ అంశాలపైన ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా.... అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడానికి తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తిని మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు  సమాచారం. ప్రాణాలను సైతం పనంగా పెట్టి వైద్యసేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతే ఎలా అన్న ప్రశ్న అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచే మంత్రులకు ఎదురు కావడం గమనార్హం. పండ్లతోటల రైతులను ఆ దుకోవాలని ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో  మం త్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిలువరించేందుకు పకడ్బందీ గా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని జిల్లా కలెక్టర్‌కు గట్టిగానే సూచించినట్లు  సమాచారం. 


Read more