డేటా ఎంట్రీలో తప్పులు దొర్లితే ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2020-05-11T10:22:30+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి డేటా ఎంట్రీలో తప్పులు దొర్లితే ఉపేక్షించేది

డేటా ఎంట్రీలో తప్పులు దొర్లితే ఉపేక్షించేది లేదు

కలెక్టర్‌ గంధం చంద్రుడు


అనంతపురం, మే 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించి డేటా ఎంట్రీలో తప్పులు దొర్లితే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ గంధం చంద్రు డు అధికారులను హెచ్చరించారు. ప్రైమరీ, సెకండరీ కాం టాక్ట్‌ గుర్తింపు, క్వారంటైన్‌ సెంటర్లలో ఆస్పత్రుల అడ్మిష న్స్‌, వీఆర్‌డీఎల్‌లో శాంపిల్‌ టెస్టింగ్‌ అంశాల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు.  ఆదివారం కలె క్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌-19 అధికారులతో సమావేశమయ్యారు. ప్రత్యేకంగా డేటాఎంట్రీపై సమీక్షిం చారు. ముందుగా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రి అడ్మిషన్స్‌, వీఆర్‌డీఎల్‌లో శాంపిల్‌ టెస్టింగ్‌ తది తర అంశాల్లో డేటా ఎంట్రీలో తప్పులు దొర్లుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. ఆ తప్పులు దొర్లకుండా ఎలా సరిచేయాలో ఆయన ప్రాక్టికల్‌గా డేటాఎంట్రీ ఆపరేటర్లకు  వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డేటాఎంట్రీకి సంబం ధించి ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే  పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు.


కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ డేటాఎంట్రీలో తప్పులు సరిచేయాలని నోడల్‌ అధికారులు రవీంద్ర, శ్రీనివాసులను ఆయన ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి రెండ్రోజుల్లో డేటాఎంట్రీని సరిచేసేలా చర్యలు తీసుకోవాలని ధర్మవరం ఆర్డీఓను ఆదేశించారు. ఆస్పత్రుల అడిషన్స్‌ సమాచారాన్ని సరిచేయాలని ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ రామస్వామినాయక్‌ను ఆదేశించారు. హిందూపు రం ఆస్పత్రికి సంబంధించి కేసుల విషయాన్ని సీరియస్‌ గా తీసుకుని సరిచేయాలన్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి లాగిన్‌లోకి వెళ్లి ఈ తప్పులన్నీ సోమవారంలోపు సరిచే యాలని నోడల్‌ అధికారి, డ్వామా పీడీ ప్రసాద్‌బాబును ఆదేశించారు. కొంత మంది మెడికల్‌ అధికారులు శాంపిల్‌ టెస్టింగ్‌ వివరాలను సరిగ్గా నమోదు చేయలేదన్నారు. అ లాంటి వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని అదనపు డీఎంహెచ్‌ఓ పద్మావతిని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ జాహ్నవి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతితో పాటు నోడల్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T10:22:30+05:30 IST