ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారు ?
ABN , First Publish Date - 2020-12-03T06:12:50+05:30 IST
‘మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ప్రభుత్వ స్కూళ్లు కాకుండా, ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారు? ఏడాదికి ఎంత డబ్బు చెల్లిస్తున్నారు ?’ వంటి ప్రశ్నలతో కలెక్టర్ సమీక్షకు హాజరైన వారిని ప్రశ్నించి విస్మయపరిచారు. మీలో నడిచి కొందరు, అనేక సమస్యల నడుమ కొందరు చదివి, ఎదిగారన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను రూపుమారే దశలో మీరున్నారని, అదే నాడు-నేడు అని, దీనితో విప్లవాత్మకమైన మార్పులు తేవాలంటూ సూచించారు.

ఎంఈఓలు, హెచ్ఎంలు, టీచర్లకు కలెక్టర్ సూటి ప్రశ్న
నాడు-నేడుతో విప్లవాత్మకమైన మార్పులు
పిల్లలను మార్చే శక్తి మీ చేతుల్లోనే...
కలెక్టర్ గంధం చంద్రుడు
అనంతపురం విద్య, డిసెంబరు 2 : ‘మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ప్రభుత్వ స్కూళ్లు కాకుండా, ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారు? ఏడాదికి ఎంత డబ్బు చెల్లిస్తున్నారు ?’ వంటి ప్రశ్నలతో కలెక్టర్ సమీక్షకు హాజరైన వారిని ప్రశ్నించి విస్మయపరిచారు. మీలో నడిచి కొందరు, అనేక సమస్యల నడుమ కొందరు చదివి, ఎదిగారన్నారు. ఇప్పుడు ఆ సమస్యలను రూపుమారే దశలో మీరున్నారని, అదే నాడు-నేడు అని, దీనితో విప్లవాత్మకమైన మార్పులు తేవాలంటూ సూచించారు. బుధవారం మనబడి నాడు-నేడు, రాజ్యాంగ దినోత్సవంపై అంబేడ్కర్ భవన్లో ఎంఈఓలు, నాడు-నేడు స్కూళ్ల హెచ్ఎం, ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సోషియల్ టీచర్లు, పలుశాఖల ఇంజనీర్లతో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ తమ బాల్యంలో పాఠశాల పరిసరాలు ఎలా ఉన్నాయ్? ఎలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారు..? టీచర్లు ఎలా ఉన్నారు? అంటూ....టీచర్లు, హె చ్ఎంలు, ఎంఈఓలతో ముఖాముఖి మాట్లాడారు. తర్వాత పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు?ఎంత డబ్బు చెల్లిస్తున్నా రంటూ ప్రశ్నించడంతో...అందరిలో ఒకింత విస్మయం, ఆం దోళన మొదలైంది. ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు అని కొందరు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉత్తమ ఫలితాలు ఇలా ఒక్కోరు ఒక్కో సమాధానం చెప్పారు. ఎంత మంది ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారో చేతులు పైకెత్తండి అంటే...75 శాతం మంది చేతులెత్తారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాడు-నేడు పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తే మీరు బాల్యంలో ఎదుర్కొన్న అన్ని సమస్యలు భవిష్యత్తు తరాలకు ఉండవన్నారు. స్కూళ్లలో ఎక్కువ సమయం పిల్లలు మీ వద్దే ఉంటారని, వారిని అంతిమంగా మార్చే శక్తి మీకే ఉందని ఉపాధ్యాయులకు సూచించారు. మన రాజ్యాంగంపైన 8 వారాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగంపై మంచి అవగాహన కల్పించి సమాజానికి మంచి పౌరులను అందించాలని సూచించారు. జేసీ సిరి మాట్లాడుతూ నాడు-నేడు పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలన్నారు. పూర్తి చేసిన పనులను వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. అంతకుముందు డీఈఓ శామ్యూల్, ఏపీసీ తిలక్ విద్యా సాగర్ నాడు-నేడు పనులు, రాజ్యాంగ దినోత్సవం విశిష్ట తలు వివరించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఈఈ శివకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, ఎంఈఓలు ఇతర అధికారులు పాల్గొన్నారు.