-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Close of interstate boundaries
-
అంతర్రాష్ట్ర సరిహద్దుల మూసివేత
ABN , First Publish Date - 2020-03-24T10:32:27+05:30 IST
కరోనా వైరస్ కట్టడికి అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త వ్యక్తులు రాకుండా కర్ణాటక -ఆంధ్ర సరిహద్దుల నంటినీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా మూసివేశారు.

రాయదుర్గం, మార్చి 23 : కరోనా వైరస్ కట్టడికి అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొత్త వ్యక్తులు రాకుండా కర్ణాటక -ఆంధ్ర సరిహద్దుల నంటినీ పోలీసులు సోమవారం మధ్యాహ్నం నుంచి పూర్తిగా మూసివేశారు. రాయదుర్గం నుంచి బళ్లారి వైపు ఉన్న ఓబుళాపురం చెక్‌పోస్టును, ఇటు మొలకా ల్మూరు వైపు మారెమ్మ గుడి వద్ద బొమ్మనహాళ్ నుంచి బళ్లారికి వెళ్లే ప్రధాన రహదారిని, గుమ్మఘట్ట నుంచి కర్ణాటకలోని కోనాపురం, చెళ్లకెర లాంటి ప్రాంతాలకు వెళ్లే రహదారులన్నింటినీ పూర్తిగా మూసివేశారు. బైక్‌లను సైతం ఎక్కడికక్కడ నిలిపివేశారు.
మురిడీ బ్రహ్మోత్సవాలు రద్దు
మురిడీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కావాల్సిన బ్రహ్మోత్సవాలను ఈ సారి రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆలయంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశంలో అధ్యక్షుడు పద్మనాభరెడ్డితో పాటు కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా బ్రహ్మోత్సవాలను రద్దు చేయాలని ఆమోదించారు. కాకపోతే ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ని ర్వహించే సంప్రదాయ పూజలు పూర్తిగా నిర్వహించనున్న ట్లు స్పష్టం చేశారు. అర్చకులు మాత్రమే బ్రహ్మోత్సవ పూజలు కొనసాగిస్తున్నారని ప్రకటించారు.
కంబదూరు : ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. ఆంధ్ర, కర్నాటక పోలీసుల సమన్వయంతో కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం కంబ దూరు ఎస్‌ఐ గౌస్‌పీరా, కర్నాటక ప్రాంతమైన పావగడ సీఐ నాగరాజు, వైఎన్‌హెచ్‌కోట ఎస్‌ఐ రామయ్య సరిహద్దులో బందోబస్తుపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ నెల 31 వరకు కొనసా గిస్తామని వారు తెలిపారు.