14వరకు మద్యం బంద్‌

ABN , First Publish Date - 2020-03-29T11:01:59+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మద్యం విక్రయాలకు జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడు బంద్‌ ప్రకటించారు.

14వరకు మద్యం బంద్‌

బార్లు, దుకాణాల మూసివేత

ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్‌


అనంతపురం క్రైం, మార్చి 28: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్‌ 14వ తేదీ వరకు మద్యం విక్రయాలకు జిల్లా కలెక్టర్‌ గంధం చం ద్రుడు బంద్‌ ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలో ఈనెల 23 నుంచి మార్చి 31వ తేదీ వరకు మద్యం విక్రయాలు బంద్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు ఏప్రిల్‌ 1నుంచి 14వ తేదీ వరకు కూడా జిల్లాలో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నామన్నారు. జిల్లాలోని అనంతపురం, పెనుకొండ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు, 33 బార్లలో మద్యం విక్రయాలు ఏప్రిల్‌ 14వ తేదీ వరకు బంద్‌ చేస్తున్నట్లు తెలిపారు. కల్లు దుకాణాలను కూడా మూసివేయాల్సిందేనని, ఆ దిశగా జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారులను అదేశించామన్నారు. 

Updated Date - 2020-03-29T11:01:59+05:30 IST