ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ వేడుకలు

ABN , First Publish Date - 2020-12-26T05:57:29+05:30 IST

పట్టణంలోని క్రైస్తవ మందిరాల్లో క్రిస్మస్‌ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గురువారం రాత్రి నుంచే క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్‌ వేడుకలు

హిందూపురం టౌన, డిసెంబరు 25 : పట్టణంలోని క్రైస్తవ మందిరాల్లో క్రిస్మస్‌ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. గురువారం రాత్రి నుంచే క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అన్ని చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. భువిపైకి దేవుని కుమారుడి రాకను ఆహ్వానిస్తూ ప్రార్థనలు చేశారు. మతప్రభోదకులు క్రీస్తూ సందేశాలను  ఉపదేశించారు. పాపంతో కూ డిన సమాజాన్ని పాపరహితంగా చేసి ప్రపంచానికి శాంతి సందేశం ఇవ్వడమే క్రీస్తు జననం ఉద్దేశ్యమన్నారు. హిం దూపురం పట్టణంలోని సీఅండ్‌ఐజి మిషనచర్చితోపాటు పరిగి రోడ్డు, టీచర్స్‌కాలనీ, డీఆర్‌కాలనీ, త్యాగరాజ్‌నగర్‌, హస్నాబాద్‌ ముద్దిరెడ్డిపల్లి,  లక్ష్మీపురం, మోడల్‌కాలనీ ప లు ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. 

Updated Date - 2020-12-26T05:57:29+05:30 IST