ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి

ABN , First Publish Date - 2020-12-26T06:33:23+05:30 IST

మండలపరిధిలోని చిత్రావతి బ్రిడ్జి వద్ద చిన్నారిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి గంగాదేవి(8) అక్కడిక్కడే మృతిచెందింది

ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి


బత్తలపల్లి, డిసెంబరు25: మండలపరిధిలోని చిత్రావతి బ్రిడ్జి వద్ద చిన్నారిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి గంగాదేవి(8) అక్కడిక్కడే మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పత్యాపురానికి చెందిన గౌతమ్‌, మణేమ్మ కుటుంబసభ్యులు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దంపెట్ల సమీపంలో వెలసిన చెన్నకేశవస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని ఇంటికి వెళ్తుండగా చిత్రావతి బ్రిడ్జి వద్ద నది ప్రవాహన్ని చూసేందుకు కుటుంబసభ్యులు దిగారు. స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటోను ఎక్కెందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి గంగాదేవి అక్కడిక్కడే మృతిచెందింది. గంగాదేవి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారి గంగాదేవి మృతిచెందడంతో కుటుంబసభ్యులు ఒడిలేకి ఎత్తుకుని రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 


విద్యుదాఘాతంతో వ్యక్తి... 

లేపాక్షి, డిసెంబరు 25 : విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని గౌరిగానిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గౌరిగానిపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్‌ హరీష్‌ అలియాస్‌ హనుమంతరాయప్ప(32) ఇంటిపై నీళ్లు చల్లుతుండగా విద్యుత్‌ వైరు తగిలి షాక్‌కు గురై మృతిచెందాడన్నారు.  భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Updated Date - 2020-12-26T06:33:23+05:30 IST