రూ.90 లక్షలు ఇదీ.. యానిమేటర్‌ స్వాహా చేసిన మొత్తం

ABN , First Publish Date - 2020-04-21T08:53:08+05:30 IST

రాప్తాడు మండలం చెర్లోపల్లి యానిమేటర్‌ నాగలక్ష్మి అవినీతిపై వెలుగు అధికారుల విచారణ పూర్తయింది. డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల సొమ్ము ఏకంగా రూ.90 లక్షలు యానిమేటర్‌ స్వాహా చేసినట్లు...

రూ.90 లక్షలు ఇదీ.. యానిమేటర్‌ స్వాహా చేసిన మొత్తం

  • విచారణ పూర్తి.. కలెక్టర్‌కు నివేదిక -
  • ఆరుగురు వెలుగు సిబ్బంది ప్రమేయం.. వేటుకు సిద్ధం

రాప్తాడు, ఏప్రిల్‌ 20: రాప్తాడు మండలం చెర్లోపల్లి యానిమేటర్‌ నాగలక్ష్మి అవినీతిపై వెలుగు అధికారుల విచారణ పూర్తయింది.  డ్వాక్రా మహిళల పొదుపు సంఘాల సొమ్ము ఏకంగా రూ.90 లక్షలు యానిమేటర్‌ స్వాహా చేసినట్లు డీఆర్‌డీఏ- వెలుగు పీడీ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 9న ‘డ్వాక్రా మహిళలకు యానిమేటర్‌ కుచ్చుటోపీ’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్ర చురితమైన  కథనానికి అధికారులు స్పందించారు. క్షేత్ర స్థా యిలో వారం రోజుల పాటు విచారణ చేశారు. మొదట బ్యాం కు రుణాలపై స్థానిక మహిళలతో కలసి విచారణ చేయగా రూ. 56 లక్షలు,  గ్రామ సంఘం విచారణలో మరో రూ.34 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. దీంతో ఆమె కాజేసిన సొమ్ము ఏకంగా రూ.90లక్షలకు చేరింది. యానిమేటర్‌ అవినీతిపై తుది నివేదికను ఇప్పటికే డీఆర్‌డీఏ-వెలుగు పీడీ నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడుకు పంపించారు. యానిమేటర్‌పై రాప్తాడు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ఆమె చెప్పిన మరికొందరిని సైతం విచారణ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో వెలుగు శాఖలో పనిచేసే ఓ ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Updated Date - 2020-04-21T08:53:08+05:30 IST