చమన్‌సాబ్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-05-08T07:56:55+05:30 IST

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చమన్‌సాబ్‌ ద్వి తీయ వర్ధంతి సందర్భంగా

చమన్‌సాబ్‌కు ఘన నివాళి

రామగిరి, మే 7: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చమన్‌సాబ్‌ ద్వితీయ వర్ధంతి సందర్భంగా గురువారం మండలంలోని ఆర్‌. కొత్తపల్లిలో ఆయన ఘాట్‌కు ఘన నివాళులర్పించారు. చమన్‌ సాబ్‌ భార్య రమీజాబేగం, కుమారుడు ఉమర్‌ముక్తియార్‌తోపాటు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ కుటుంబసభ్యులతో కలిసి చమన్‌సాబ్‌ ఘాట్‌కు వెళ్లి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రార్థనలు చేశారు. చమన్‌సాబ్‌ చేసిన సేవలను నెమరేసుకున్నారు. అనంతరం ఇంటి వద్ద అన్నదానం చేశారు.


మసీదులు, దర్గాల వద్ద భోజన ప్యాకెట్ల అందజేత

అనంతపురం టౌన్‌: రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసదీక్ష చేస్తున్న పేద ముస్లింలకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో భోజనం పొట్లాలు అందజేశారు జడ్పీ మాజీ చైర్మన్‌ చమన్‌ తనయుడు ఉమర్‌ముక్తియార్‌ ఆధ్వర్యంలో మసీదులు, దర్గాల వద్ద దాదాపు 250 మందికి భోజనం పొట్లాలు అందజేశారు.

Updated Date - 2020-05-08T07:56:55+05:30 IST