కానిస్టేబుల్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-07-22T10:10:14+05:30 IST

మండలకేంద్రంలోని పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమే్‌షపై మంగళవారం కేసు నమోదుచేశామని ఎస్‌ఐ మోహన్‌గౌడ్‌

కానిస్టేబుల్‌పై కేసు నమోదు

పుట్లూరు, జూలై21: మండలకేంద్రంలోని పోలీ్‌సస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమే్‌షపై మంగళవారం కేసు నమోదుచేశామని ఎస్‌ఐ మోహన్‌గౌడ్‌ తెలిపారు. ఆయన తె లిపిన వివరాల మేరకు అనంతపురంలోని తపోవనంలో ఉం టున్న రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగి శంకరయ్య వాహనాలను బాడుగలకు ఇచ్చేవాడన్నారు. అతనివద్ద నుంచి 5వాహనాలను వివిధ సందర్భాల్లో కానిస్టేబుల్‌ రమేష్‌ బాడుగకు తీసుకున్నాడన్నారు.


నెలలు గడుస్తున్నా అద్దె ఇవ్వకపోవడంతోపాటు బా డుగకు తీసుకున్న వాహనాలను తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేసేందుకు గాలింపు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-07-22T10:10:14+05:30 IST