కారు బోల్తా : తండ్రి, కుమార్తె దుర్మరణం

ABN , First Publish Date - 2020-03-15T12:11:07+05:30 IST

మండలంలోని రామదాసుపే పేట గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శని వారం కారు అదుపు తప్పి బోల్తా పడడంతో తండ్రి, కు మార్తె

కారు బోల్తా : తండ్రి, కుమార్తె దుర్మరణం

గార్లదిన్నె, మార్చి 14 : మండలంలోని రామదాసుపే పేట గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై శని వారం కారు అదుపు తప్పి బోల్తా పడడంతో తండ్రి, కు మార్తె మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు గుత్తి కుమ్మర వీధికి చెందిన కరణం కృష్ణమోహన్‌(51), సౌభా గ్యలక్ష్మి దంపతులు తమ కుమార్తె ఆశ(23)తో కలిసి అనంతపురం వెళ్లారు. పని ముగించుకుని తిరిగి గుత్తికి వెళ్తుండగా రామదాసుపేట గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరణం కృష్ణమోహన్‌, కుమార్తె ఆశ అక్క డిక్కడే మృతి చెందారు. సౌభాగ్యలక్ష్మి, డ్రైవర్‌ బెస్త మధు తీవ్రంగా గాయపడ్డారు.  ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి సిబ్బంది  సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.  గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు, సౌభాగ్యలక్ష్మి పరిస్థితిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-03-15T12:11:07+05:30 IST