సబ్సిడీ రుణాలు రద్దు ?

ABN , First Publish Date - 2020-08-07T10:40:06+05:30 IST

కొన్నేళ్లుగా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందజేసే సబ్సిడీ రుణాలను ..

సబ్సిడీ రుణాలు రద్దు ?

14603  మందికి నిరాశ

ఊరటనివ్వని ‘చేదోడు’

అసంతృప్తిలో బాధితులు


అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 6:  కొన్నేళ్లుగా ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందజేసే సబ్సిడీ రుణాలను లేదు, లేదంటూనే రద్దు చేసింది. దీంతో 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి 14603 మంది లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. బ్యాంకు లింకే జీ ద్వా రా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దూదేకుల, విభిన్నప్రతిభావంతులు, కాపు, ఈ బీసీ, ఎం బీసీ, వైశ్యా కార్పొరేషన్‌లతో పాటు బీసీ కులా ల ఫెడరేషన్‌లకు ప్రతి ఏటా సబ్సిడీ రుణాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. అయితే ఈ దఫా వివిధ కారణాలతో సబ్సి డీ రుణాలలో కోత విధిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు రుణాలు చెల్లించకుండానే నిలిపివేసింది. చెల్లింపు ప్రక్రియలో జాప్యం చేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఎంపికైన రుణాలను రద్దు చేశారు.  తహసీల్దార్‌, ఎంపీడీఓ, బ్యాంకులు, సచివాలయాల చు ట్టూ తిరిగి తీసుకువచ్చి అం దజేసిన వివిధ పత్రాలు (డాక్యుమెంటేషన్లు) వృథా అయ్యాయని లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది ..రామాంజనేయులు, ఈడీ, బీసీ,కాపు కార్పొరేషన్‌

సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం లేదు. అధికారికంగా రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఒక వేళ సబ్సిడీ రుణాలు రద్దు చేస్తే వాటి స్థానంలో కొత్త పథకం ద్వా రా లబ్ధి చేకూరుస్తారని భావిస్తున్నాం.  ఎంపికైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నోటిఫికేషన్‌ లేదా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. 


తీవ్ర నిరాశలో లబ్ధిదారులు

జిల్లాలో 14603 సబ్సిడీ రుణాలు రద్దు చేశారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌ 3137, ఎస్సీ 465, మైనార్టీ 963, క్రిస్టియన్‌ 46, దూదేకుల 161, విభిన్నప్రతిభావంతులు 99, బీసీ 2171, కాపు 4500, ఈబీసీ 390, ఎంబీసీ 120, వైశ్యకార్పొరేషన్‌ 11 రుణాలు రద్దు చేశారు. ఇక 9 బీసీ కులాల కార్పొరేషన్‌లకు సంబంధించి 2540 రుణాలు రద్దు చేశారు. కాగా జగనన్న చేదోడు పథకంలో బీసీల్లో మూడు కులాలు రజక, నాయీబ్రాహ్మణులతో పాటు టైలర్లకు మాత్రమే అరకొరగా సాయమందించారు. మిగిలిన బీసీలోని పలు కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఎంబీసీ, వైశ్యులు సబ్సిడీ రుణాల రద్దుతో తీవ్ర నిరాశలో ఉండిపోయారు.

Updated Date - 2020-08-07T10:40:06+05:30 IST