ఇంటి పట్టాల పంపిణీకి బ్రేక్‌

ABN , First Publish Date - 2020-12-30T07:08:52+05:30 IST

బలవంతంగా రైతుల నుంచి భూమిని లాక్కోని ఇంటి పట్టాలు పంచాలన్న అధికార యం త్రాంగానికి హైకోర్టు బ్రేకులు వేసింది.

ఇంటి పట్టాల పంపిణీకి బ్రేక్‌
తిలక్‌నగర్‌లో ఇంటి పట్టాలకు బ్రేక్‌పడిన భూమి

హిందూపురం, డిసెంబరు29: బలవంతంగా రైతుల నుంచి భూమిని లాక్కోని ఇంటి పట్టాలు పంచాలన్న అధికార యం త్రాంగానికి హైకోర్టు బ్రేకులు వేసింది. ఈనేపథ్యంలో బుధవారం పట్టాల పంపిణీ కార్యక్రమం ఆగింది. వివరాల్లోకి వెళ్లితే  హిందూపురం పట్టణం సమీపంలోని లేపాక్షి మం డలం పులమతి పంచాయతీ పరిధిలోని 81 మంది పేదలకు పట్టాలిచ్చేందుకు తిలక్‌నగర్‌లో సర్వేనెంబర్‌ 200లో 5.20 ఎకరాల్లో అసైన్డమెంట్‌ భూమిలో ప్రభుత్వం లేఔట్‌ సిద్ధం చేశారు. అయితే ఈ భూమిని 1885లో కొనుగోలు చేసిన యజమానులు తమ భూమి బలవంతంగా లాక్కున్నారని పరిహారం పెంచాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పట్టాల పంపిణీ నిలిపివేయాలని హైకోర్టులో స్టే ఉత్తర్వులు ఇవ్వడంలో బుధవారం ఇవ్వాల్సిన ఇంటి పట్టాల పంపిణీ నిలిపివేశారు. ఇలా ఉంటే ఈ భూమిలో కొందరు రెవెన్యూ అధికారులు కొన్నాల్లుగా ఇష్టానుసారం ఇంటి పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. హిందూపురం పట్టణానికి సమీపంలో భూమి ఉండడంతో ఎకరం కోటికిపైగా ధరలు పలుకుతోంది. ఈనేపథ్యంలో లేపాక్షిలో ఉన్న వారికి సైతం ఇంటి పట్టాలు ఇవ్వడం చర్చంశనీయంగా మారింది. ఈ విషయంపై లేపాక్షి తహసీల్దార్‌ బలరామ్‌ మట్లాడుతూ పులమతి సమీపంలోని తిలక్‌నగర్‌ ప్రభుత్వం పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు అసైన్డమెంట్‌ భూమిలో లేఔట్‌ నిర్మాణం చేపట్టామన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు స్టే ఉత్తర్వులతో బుధవారం చేపట్టాల్సిన ఇంటి పట్టాల పంపిణీ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఉన్నధికారులకు దృష్టికి తీసుకెళ్లామని తదిపరి ఆదేశాలు వచ్చిన అనంతరం పట్టాల పంపిణీ చేస్తామని చెప్పారు. 

Updated Date - 2020-12-30T07:08:52+05:30 IST