జగన్‌ పాలనలాగే రోడ్లన్నీ గుంతలమయం

ABN , First Publish Date - 2020-12-06T06:09:39+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న అవగాహనలేమి పాలనలాగే రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

జగన్‌ పాలనలాగే రోడ్లన్నీ గుంతలమయం
అనంతపురంలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

అనంతపురం అర్బన్‌, డిసెంబరు 5: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న అవగాహనలేమి పాలనలాగే రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆధ్వర్యలో శనివారం స్థానిక బస్టాండ్‌ వద్ద వినూత్నరీతిలో నిరసన తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, నేత గంగినేని ప్రభాకర్‌ గుంతల రోడ్డులో ప్లకార్డులు పట్టుకుని, చేతకాని ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలయమంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7వేల కోట్ల నిధులు చెల్లిస్తే, సీఎం జగన్‌ వాటిని నవరత్నాలకు మళ్లించి, రోడ్లపై ప్రయాణం నరకయాతనగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అభి వృద్ధిని గాలికొదిలి, క్విడ్‌ప్రొకో విధానంలో అవినీతిని వ్యవస్థీకృతం చేస్తోందన్నారు. ఇసుక కొరత, నకిలీ మద్యం మాఫియాతో జగన్‌ వేలకోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, సామాన్యులను రడ్డున పడేశారన్నారు. అధికార వికేంద్రీకరణ పేరుతో పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు లలిత్‌కుమార్‌, రామచంద్రయ్య, రత్నమయ్య, మల్లివేముల అమర్‌నాథ్‌, పూల ప్రభాకర్‌, సుధాకర్‌రెడ్డి, అశోక్‌, రంగమ్మ, గాయత్రి, రఫీ, సుందర్‌ మోహన్‌, దిలీప్‌, యశ్వంత్‌, మహేష్‌, గౌతమ్‌, తేజ, విశ్వేశ్వరరెడ్డి, బాలకృష్ణ, పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:09:39+05:30 IST