స్నేహలత హత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

ABN , First Publish Date - 2020-12-26T06:15:04+05:30 IST

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే స్నేహలత హత్యకు కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బైరెడ్డి శబరి మండిపడ్డారు. శుక్రవారం ఆమె అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులతో కలసి నగరంలోని స్నేహలత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

స్నేహలత హత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బైరెడ్డి శబరి ధ్వజం

అనంతపురం అర్బన్‌, డిసెంబరు 25 : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే స్నేహలత హత్యకు కారణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బైరెడ్డి శబరి మండిపడ్డారు. శుక్రవారం ఆమె అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులతో కలసి నగరంలోని స్నేహలత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బైరెడ్డి శబరి మాట్లాడుతూ... తన కూతురిని వేధిస్తూ ఇంటిపై దాడి చేస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం జగన్‌ పాలనకు నిదర్శనమన్నారు. ఆ నిర్లక్ష్యమే ఈ హత్యకు  కారణమైందన్నారు. దిశ చట్టం అమలు ప్రకటనలకే పరిమితం చేశారన్నారు. నగర నడిబొడ్డునే ఆ కతాయిల వేధింపులకు, అకృత్యాలకు బాలికలు గురువుతుంటే.. ఇ తర ప్రాంతాల్లో అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆం దోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లివేముల అమర్నాథ్‌, లలిత్‌కుమార్‌, ఆదిలక్ష్మమ్మ, సూర్యప్రకాష్‌, అశోక్‌ ఉన్నారు. 


Updated Date - 2020-12-26T06:15:04+05:30 IST