-
-
Home » Andhra Pradesh » Ananthapuram » bangaram
-
దొంగ అరెస్ట్ - బంగారం స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-15T06:00:21+05:30 IST
పట్టపగలు ఇంటికి కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతున్న రాజకుళ్లాయప్పను అరెస్ట్ చేసిన ట్లు రూరల్ ఇనచార్జి సీఐ ల క్ష్మన్న సోమవారం తెలిపారు.

తాడిపత్రి రూరల్, డి సెంబరు 14: పట్టపగలు ఇంటికి కన్నం వేసి దొంగతనాలకు పాల్పడుతున్న రాజకుళ్లాయప్పను అరెస్ట్ చేసిన ట్లు రూరల్ ఇనచార్జి సీఐ ల క్ష్మన్న సోమవారం తెలిపారు. అతని వద్ద నుంచి రూ.1.25 లక్షలు విలువైన రెండున్నర తులాల బంగారు ఆభరణా లు, రూ.15 వేల విలువైన వెండిపట్టీలు, రూ.600 నగదు స్వాధీనం చేసుకున్నామన్నా రు. యాడికి మండలం మార్కెట్‌వీధికి చెందిన రాజకుళ్లాయప్పను ఎస్‌ఐ ఖాజాహుస్సేన, సిబ్బంది అరెస్ట్ చేశారన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు.