పురం ప్రజల ఆరోగ్యంపై బాలయ్య ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2020-09-17T10:50:50+05:30 IST

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజ ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు.

పురం ప్రజల ఆరోగ్యంపై బాలయ్య ప్రత్యేక శ్రద్ధ

హిందూపురం టౌన్‌, సెప్టెంబరు 16 :  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎక్కడున్నా నియోజకవర్గ ప్రజ ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం హిందూపురం కొవిడ్‌ ఆస్పత్రికి బాల య్య అందజేసిన రూ.55 లక్షలు విలువచేసే పరికరాలను అందజేశారు. ఐదు స్ర్టెచ్చర్‌లు, 70 ఆక్సిజన్‌ ప్లో మీటర్లు హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి పంపారు.


వాటిని టీడీపీ నాయకులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ దివాకర్‌బాబు, రుక్మిణమ్మకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పట్టణా ధ్యక్షుడు రమేష్‌,  ఆర్‌ఎంఎస్‌ షఫీ, అమర్‌నాథ్‌, హెచ్‌ఎన్‌ రాము, నవీన్‌ హిదాయతు ల్లా, బాబా, నజీర్‌, రామాంజి, మోదాశివ, శ్రీనివాసులు, రామ్మోహన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-17T10:50:50+05:30 IST