అంతర్రాష్ట్ర సరిహద్దులపై డేగకన్ను

ABN , First Publish Date - 2020-04-05T10:35:59+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులపై డేగకన్ను ఉంచినట్లు కోవి డ్‌ నివారణ జిల్లా ప్రత్యేకాధికారి బాబురావునాయుడు పేర్కొన్నారు.

అంతర్రాష్ట్ర సరిహద్దులపై డేగకన్ను

కోవిడ్‌ నివారణ జిల్లా ప్రత్యేకాధికారి బాబురావునాయుడు 


రాయదుర్గంటౌన్‌, ఏప్రిల్‌ 4 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులపై డేగకన్ను ఉంచినట్లు కోవి డ్‌ నివారణ జిల్లా ప్రత్యేకాధికారి బాబురావునాయుడు పేర్కొన్నారు. రాయదుర్గం పట్ట ణ సమీపంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను శనివారం ఆయన అధికారులతో కలసి పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రజలు ఎవరూ రాకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.


ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో కరోనా విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్రం నుంచి ప్ర జలు ఆంరఽధాలోకి అడుగు పెట్టకుండా నిఘా ముమ్మరం చేసినట్లు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు రెవెన్యూ, పోలీసు ఇతర శాఖల అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 14 అనంతరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ సీఐ తులసీరామ్‌, మున్సిపల్‌ కమీషనర్‌ కే రామచంద్రరావు, ఎస్‌ఐ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T10:35:59+05:30 IST