ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించాలి

ABN , First Publish Date - 2020-12-28T06:02:29+05:30 IST

ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించాలని అనంతపురం శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి శ్రీపాద విద్యానరసింహ భారతి స్వామి పేర్కొన్నారు.

ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించాలి

శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి 

పెనుకొండ, డిసెంబరు 27: ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించాలని అనంతపురం శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి శ్రీపాద విద్యానరసింహ భారతి స్వామి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వాసవీ కన్వెన్షనహాల్లో విశ్వంబర ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుర్వేద పరంపర వైద్యులకు ఘనసన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వంబర ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన సువర్ణకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భారతి స్వామి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యానికి ఎంతో మహత్యం ఉందని మన పూర్వీకులు కనుగొన్నారన్నారు. ప్రతి జిల్లాలో ఆయుర్వేద వైద్యం అందిస్తున్న వారిని గుర్తించి సత్కరిస్తున్న విశ్వంబర ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన సువర్ణ అభినందనీయురాలన్నారు. చైర్మన సువర్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేదానికి ఇస్తున్న ప్రోత్సాహంతో ఆయుర్వేద వైద్యు లు తమ పనితీరును పెంచుకోవాలన్నారు. అనంతరం ఆయుర్వేద వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T06:02:29+05:30 IST