-
-
Home » Andhra Pradesh » Ananthapuram » awards to railway employees
-
రైల్వే ఉద్యోగులకు అవార్డులు
ABN , First Publish Date - 2020-12-27T06:25:27+05:30 IST
గుంతకల్లులో పనిచేస్తున్న 12 మంది రైల్వే ఉద్యోగులకు జీఎం అవార్డులు లభించాయి. దక్షిణ మధ్య రైల్వే 65వ వీక్ సెలెబ్రేషన్స్‌లో భాగం గా జోన్ వ్యాప్తంగా విధి నిర్వహణలో నిబద్ధత చూపిన 173 మంది ఉద్యోగులను ప్రోత్సహిస్తూ రైల్వే శాఖ జోనల్ అవార్డులను ప్రకటించింది.

గుంతకల్లు, డిసెం బరు 26: గుంతకల్లులో పనిచేస్తున్న 12 మంది రైల్వే ఉద్యోగులకు జీఎం అవార్డులు లభించాయి. దక్షిణ మధ్య రైల్వే 65వ వీక్ సెలెబ్రేషన్స్‌లో భాగం గా జోన్ వ్యాప్తంగా విధి నిర్వహణలో నిబద్ధత చూపిన 173 మంది ఉద్యోగులను ప్రోత్సహిస్తూ రైల్వే శాఖ జోనల్ అవార్డులను ప్రకటించింది. అందులో గుంతకల్లు డివిజన్‌కు సంబంధించి 25 మందికి అవార్డులు వచ్చాయి. ఈ వ్యక్తిగత అవార్డుల్లో 12 స్థానిక ఉద్యోగులకు దక్కాయి. స్థానికంగా అవార్డులు లభించిన వారిలో కౌశల్‌పాండే (డీఈఎన్), సీ హరిబాబు (సీసీఐ-సీనియర్ డీసీఎం), మహబూబ్ బాషా (సీపీఎ్‌స-సీనియర్ డీసీఎం), మురళీమోహన్ (ఎస్‌ఎ్‌సఈ), రమణయ్య (ఎస్‌ఎస్ ఈ), రాఘవరెడ్డి (సీనియర్ టెక్నీషియన్-డీజల్‌షెడ్), కృష్ణారెడ్డి, (ఎస్‌ఎ్‌సఈ), మ హబూబ్ బాషా (ఎస్‌ఎ్‌సఈ), తిప్పానాయక్ (డ్రెస్సెర్), మురళీధరన్ (సీహెచ్‌సీ), ప్రవీణ్‌బాబు (సీనియర్ టెక్నీషియన్ ) ఉన్నారు. గుత్తికి చెందిన సీ మనోజ్‌కుమార్ (ఎస్‌ఎ్‌సఈ- డీజల్‌షెడ్)తోపాటు తిరుపతికి చెందిన ఏడుగురికి, కడప వాసులు ఇద్దరు, రేణిగుంట, మంత్రాలయం, తాడిపత్రిల్లో పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగికి వ్యక్తిగత జీఎం అవార్డులు దక్కాయి. వారికి ఆయా శాఖల ఉద్యోగులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెల 30వ తేదీన ప్రారంభంకానున్న రైల్వే వారోత్సవాల సందర్భంగా వీరికి అవార్డులు అందజేయనున్నారు.