బాడుగ రానన్నందుకు ఆటో డ్రైవర్‌ హత్య

ABN , First Publish Date - 2020-03-21T10:48:12+05:30 IST

పట్టణంలోని టైలర్స్‌ కాలనీలో గురువారం అర్ధరాత్రి బాడుగకు రానందుకు ఆ టో డ్రైవర్‌ దస్తగిరి అలియాస్‌ లడ్డు (26)ను హత్య చే శారు.

బాడుగ రానన్నందుకు ఆటో డ్రైవర్‌ హత్య

తాడిపత్రిటౌన్‌, మార్చి 20 :  పట్టణంలోని టైలర్స్‌ కాలనీలో గురువారం అర్ధరాత్రి బాడుగకు రానందుకు ఆ టో డ్రైవర్‌ దస్తగిరి అలియాస్‌ లడ్డు (26)ను హత్య చే శారు. సీఐ తేజమూర్తి తెలిపిన మేరకు పట్టణానికి చెందిన ఆదితోపాటు మరికొంత మంది వ్యక్తులు కలిసి దస్తగిరి ఆటోను ఆపి బాడుగను రావాలని ఒత్తిడి చేశా రు. బాడుగకు రాలేనని అర్ధరాత్రి కావడంతో ఇంటికి వెళ్లాలని వారికి చెప్పాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో  మద్యం మత్తులో ఉన్న నిందితులు ఆగ్రహంతో దస్తగిరిపై రాళ్లతో దాడిచేశారు. అదే సమయం లో పోలీసు వాహనం రావడంతో పసిగట్టిన నిందితులు పారిపోయారు. తీవ్రం గా గాయపడ్డ దస్తగిరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం అక్క డి నుంచి కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృ తిచెందాడని సీఐ తెలిపారు. మృతుడి అన్న దస్తగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సంఘటనలో నిందితుడైన ఆదిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగి లిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

Updated Date - 2020-03-21T10:48:12+05:30 IST