ఎస్‌ఐపై వైసీపీ శ్రేణుల దాడి

ABN , First Publish Date - 2020-03-24T10:29:40+05:30 IST

మండలంలో ని నాయనపల్లి క్రాస్‌లో సోమవారం లాక్‌డౌన్‌ సందర్భంగా షాపును బంద్‌ చేయాలన్న ఎస్‌ఐపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.

ఎస్‌ఐపై వైసీపీ శ్రేణుల దాడి

 షాపును బంద్‌ చేయాలన్నందుకే...  


శింగనమల, మార్చి 23 : మండలంలో ని నాయనపల్లి క్రాస్‌లో సోమవారం లాక్‌డౌన్‌ సందర్భంగా షాపును బంద్‌ చేయాలన్న ఎస్‌ఐపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వివరాల్లోకె ళ్తే... కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రాత్రి ఎస్‌ఐ రాంభూపా ల్‌ యాదవ్‌ నాయనపల్లిక్రాస్‌కు తనిఖీకి వెళ్లా రు. అక్కడ నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగతావాటిని మూసివేయాలని ఎస్‌ఐ సూచించాడు. అయితే  వైసీపీ నాయకుడు లక్ష్మిరెడ్డి తన కూల్‌డ్రింగ్‌ షాపును మూసివేయకుం డా తెరిచే ఉంచాడు. దీంతో ఎస్‌ఐ ‘మీకు ఎన్నిసార్లు చెప్పాలి... బంద్‌ చేయండి‘ అని ఆదేశించారు. 


  అయినా వినకపోవడంతో  ఎస్‌ఐ షాపు లో ఉన్న లక్ష్మిరెడ్డి, ఆయన మనవడు  లిఖిత్‌పై  చేయిచేసుకున్నాడు. ఇందుకు ఆగ్రహించిన   ల క్ష్మిరెడ్డి, లిఖిత్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు ఎస్‌ఐపై దాడికి దిగారు. ఎస్‌ఐను చొక్కా పట్టుకుని చేతిని కొరికి గాయపరిచారు. సంఘటన స్థలానికి ఇటుకలపల్లి సీఐ విజయ్‌భాస్కర్‌గౌడ్‌, నార్పల, బుక్కరాయసమద్రం ఎస్‌ఐలు చేరుకు ని విచారణ చేశారు. లక్ష్మిరెడ్డి, లిఖిత్‌పై కేసు న మోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు.

Read more