టిడ్కో లబ్ధిదారులకు స్థలాలు

ABN , First Publish Date - 2020-12-20T05:42:16+05:30 IST

నియోజకవర్గవ్యాప్తంగా టిడ్కో లబ్ధిదారులు 2112 మంది ఉన్నారనీ, వారందరికీ ఉచితంగానే స్థలాలిస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు అం దించి, న్యాయం చేస్తామన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఆయన కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, ఆర్డీఓ గుణభూషణ్‌ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

టిడ్కో లబ్ధిదారులకు స్థలాలు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

రెండు దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం..

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం కార్పొరేషన్‌, డిసెంబరు19: నియోజకవర్గవ్యాప్తంగా టిడ్కో లబ్ధిదారులు 2112 మంది ఉన్నారనీ, వారందరికీ ఉచితంగానే స్థలాలిస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు అం దించి, న్యాయం చేస్తామన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం ఆయన కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, ఆర్డీఓ గుణభూషణ్‌ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25వ తేదీ నుంచి నెల రోజలపాటు పండుగ వాతావరణంలో ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 33067 మందికి పట్టాలు అందించేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు. ఇందులో టిడ్కో లబ్ధిదారులు 2112 మంది ఉన్నారనీ, వారందరికీ ఉచితంగానే స్థలాలిస్తామన్నారు. వారు కట్టిన డ బ్బు తిరిగి చెల్లిస్తామన్నారు. ఇంకా అర్హులుంటే వెంటనే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుర్తించిన 10 లేఅవుట్లలో రెండు దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి మా ట్లాడుతూ పట్టాల పంపిణీ నిరంతరం కొనసాగుతుందనీ, ఒకరోజు ఆలస్యమైనా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ మొదటి దశలో తొమ్మిది వేల ఇళ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇప్పటికే లేఅవుట్లను సిద్ధం చేశామన్నారు.


Updated Date - 2020-12-20T05:42:16+05:30 IST