ఒక్కొక్కరికి ఒక్కోలా..!

ABN , First Publish Date - 2020-12-30T06:13:46+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల్లో చట్టం కొందరికి చుట్టంగా మారింది. జీఓలు, ఆర్డర్లను అయిన వారికి ఒక రకం గా.. కానివారికి మరోలా అమలు చేస్తున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కోలా..!
జేడీ సర్వీసెస్‌ ఇచ్చినట్లు చెబుతున్న ఉత్తర్వు ప్రతి

ఇదివరకే ప్రిఫరెన్సియల్‌ 

వాడిన వారికి మళ్లీ అవకాశం

కూడేరు స్కూల్‌లో ఓ టీచర్‌కు ప్రత్యేకంగా ఉత్తర్వులు

బదిలీల్లో ఒకే పాఠశాల నుంచి ఇద్దరు అనర్హుల లబ్ధికి దరఖాస్తు

అధికారి కూతురు  అనర్హురాలైనా.. గ్రీన్‌సిగ్నల్‌

మరో టీచర్‌ను మాత్రం తప్పించిన వైనం

చక్రం తిప్పిన డీఈఓ కార్యాలయ ఉద్యోగులు


కూడేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తేన్న ఓ టీచర్‌ 2017 జూలైలో ప్రిఫరెన్సియల్‌ వాడుకున్నాడు. ఇప్పుడు మళ్లీ రోడ్డు ప్రమాదం జరిగిందంటూ మరోసారి అదే కేటగిరీలో లబ్ధి పొందుతున్నాడు. ఆయన కోసం డీఈఓ కార్యాలయ అధికారులే పైకి లేఖ రాశారు. ఆయన వాడుకోవచ్చుంటూ జేడీ సర్వీసెస్‌ ఉత్తర్వులిచ్చినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. తాను ఉత్తర్వులివ్వలేదనీ, కమిషనర్‌ ఇచ్చి ఉండొచ్చని జేడీ సర్వీసెస్‌ చెబుతున్నారు. విద్యాశాఖలో బదిలీల మాయకు ఇదో నిదర్శనం.


అనంతపురం విద్య, డిసెంబరు 29: ఉపాధ్యాయుల బదిలీల్లో చట్టం కొందరికి చుట్టంగా మారింది. జీఓలు, ఆర్డర్లను అయిన వారికి ఒక రకం గా.. కానివారికి మరోలా అమలు చేస్తున్నారు. తమ వారికి అప్పనంగా ప్రయోజనం చేకూర్చేందుకు విద్యాశాఖ కమిషనర్‌, జేడీ సర్వీసెస్‌ వంటి వారిని సైతం తప్పుదోవ పట్టించి, ప్రత్యేకంగా ఉత్తర్వులు తెప్పిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీల్లో ఒకే స్కూల్‌ నుంచి ఇద్దరు అనర్హులు దరఖాస్తు చేసుకుంటే.. ఓ వి ద్యాశాఖ రిటైర్డ్‌ ఉన్నతాధికారి కూతురికి లబ్ధి చేకూర్చి, మరో టీచర్‌ను తిరస్కరించారు. అనర్హురాలైన టీచర్‌కు అవకాశమివ్వటం ద్వారా స్వామిభక్తిని చాటుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో డీఈఓ కార్యాలయ ఉద్యోగు లే చక్రం తిప్పారన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి.


అనర్హులైనా.. పట్టం..

ఉపాధ్యాయ బదిలీల్లో అనర్హులైనా కొందరికి పట్టం కట్టారు. ఆయనో మ్యాథ్స్‌ టీచర్‌. చాలా సంవత్సరాలు డీఈఓ కార్యాలయంలో పనిచేశారు. ఈ క్రమంలో వి ద్యాశాఖ ఉన్నతాధికారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 2017 జూలైలో ప్రిఫరెన్సియల్‌ కేటగిరీ వాడుకుని, కూడేరు ఉన్నత పాఠశాలకు వచ్చాడు. జీఓ 54 మేరకు మరో 8 ఏళ్లు ఆయన వాడుకునే అవకాశం లేదు. ఈ ఏడాది బదిలీల్లో  ఎలాగైనా మళ్లీ లబ్ధి పొందాలని ప్ర యత్నాలు చేశాడు. తనకు పైన ఉన్న పరిచయాలతో డీఈఓ కార్యాలయ అధికారులతో మిలాఖత్‌ అయ్యా డు. అంతే.. గతంలో ఆయన వాడుకున్నట్లు చూపుతున్న జాబితాల్లోంచి పేరు తీయించాడు. మళ్లీ ఆయన వాడుకునేలా డీఈఓ కార్యాలయ అధికారులు నవంబరు 6న లేఖ రాశారు. తర్వాత ఈ ఏడాది బదిలీల్లో మళ్లీ ఆయనకు పట్టం క డుతున్నారు. ధర్మవరం పట్టణంలోని ఓ స్కూ ల్‌ నుంచి ఒక ప్రధానోపాధ్యాయురాలు, మరో టీచర్‌ అనర్హులైనా ప్రిఫరెన్సియల్‌ కేటగిరీ కింద దరఖాస్తు చేశారు. ప్రధానోపాధ్యాయురాలి దరఖాస్తును ఓకే చేసి, టీచర్‌ది తిరస్కరించారు. కారణం హెచ్‌ఎం విద్యాశాఖలో ప లు స్థాయిల్లో పనిచేసిన ఓ రిటైర్డ్‌ అధికారి కుమార్తె కావటమే. అందుకే ఆ హెచ్‌ఎం 2017లో స్పౌజ్‌ వాడుకుంది. ఇపుడు మళ్లీ వి తంతువు కింద దరఖాస్తు చేసింది. ఆమె మాజీ విద్యాశాఖాధికారి కూతురు కావటం, ఆయన వద్ద పనిచేశామన్న స్వామిభక్తితో డీఈఓ కా ర్యాలయంలోని కొందరు అధికారులు ఆమెకు లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది.


చెప్పేదొకటి.. చేసేదొకటి..

2020 ఉపాధ్యాయుల బదిలీల్లో మరొకొందరు టీచర్లు అడ్డదారిలో లబ్ధి పొందుతున్నారు. ఇప్పటికే చాలా దరఖాస్తులను ప్రిఫరెన్సియల్‌ కేటగిరీ నుంచి తిరస్కరించారు. ఇంకా అనర్హులున్నారు. బోగస్‌ సర్టిఫికెట్లు, తప్పు డు సమాచారం ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు. వీరికి విద్యాశాఖలోని కొందరు క్లర్కులు, సూపరింటెండెంట్లు.. డీఈఓను సైతం మాయ చేసి, సహకరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2009, 2012, 2015, 2017 బదిలీల జాబితాలను పూర్తి స్థాయిలో బహిర్గతం చేస్తే.. మరో పాతిక నుంచి 50 మంది అక్రమార్కులు బయటపడే అవకాశం ఉందన్న వాదనలు సంఘాల నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణకమిటీ వేసి, లోతైన దర్యా ప్తు చేస్తే.. అక్రమార్కులు బయటపడే అవకాశం ఉంది.


మళ్లీ వాడుకోవటానికి లేదు

2017లో ప్రిఫరెన్సియల్‌ వాడుకున్నవాళ్లు మళ్లీ ఇప్పుడు వినియోగించుకునే అవకాశం లేదు. జేడీ సర్వీసెస్‌ ఆర్డర్‌ ఇవ్వరు. స్పెషల్‌ కేస్‌ కింద కమిషనర్‌ ఇచ్చి, ఉండొచ్చు. సాధారణంగా ఇవ్వటానికి లేదు. దీనిపై విచారణ చేస్తాం.

- దేవానందరెడ్డి, జేడీ సర్వీసెస్‌, పాఠశాల విద్యాశాఖ


అమ్మఒడి జాబితాలో కొడుకు.. టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం విద్య, డిసెంబరు 29: అమ్మఒడి అర్హుల జాబితాలో తన కొడుకును చేర్చిన  ప్రభుత్వ టీచర్‌ను డీఈఓ శామ్యూల్‌ సస్పెండ్‌ చేస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నార్పల మండలం దయ్యాలకుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఎస్‌జీటీ స్వాతి రెండో తరగతి చదువుతున్న తన కొడుకు వివరాలను అడ్మిషన్‌ రిజిస్టర్‌లో తమ వివరాలతో పొందుపరిచారు. అడ్డదారిలో అమ్మఒడి ద్వారా లబ్ధి పొందడానికి విద్యార్థికి గా ర్డియన్‌గా నానమ్మ వివరాలు ఉంచారు. దీనిపై విచారణ చేయించిన డీఈఓ, అక్రమమని తేలటంతో ఆమెను సస్పెండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-30T06:13:46+05:30 IST