రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలం

ABN , First Publish Date - 2020-12-30T06:19:15+05:30 IST

తమది రైతు పక్ష పా త ప్రభుత్వమని చెప్పుకుంటున్న సీఎం జగన్‌ అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలం
కుళ్లిపోయిన వేరుశనగ కట్టెను పరిశీలిస్తున్న టీడీపీ, సీపీఐ నాయకులు

జగన్‌ పాలనపై టీడీపీ, సీపీఐ నాయకుల ఆగ్రహం

సోమందేపల్లి(పెనుకొండ), డిసెంబరు 29 : తమది రైతు పక్ష పా త ప్రభుత్వమని చెప్పుకుంటున్న సీఎం జగన్‌ అకాలవర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలుగుదేశం  పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవడం విస్మరించి ప్రభుత్వం అందిస్తున్న పరిహారంలోనూ కోత విధిస్తూ వారిని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. సోమందేపల్లి మండలంలో మంగళవారం రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం చేప ట్టారు. టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి, అనం తపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, పార్టీ అనంతపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, మాజీ మేయర్‌ స్వరూప, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, హిందూపురం మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలకుంట నుంచి మండ్లి గ్రామం వరకు పాదయాత్ర చేస్తూ ఇన్‌పుట్‌ సబ్సిడీ, కంది, వేరుశనగ పంటల నష్టాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండ్లి గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగం సభలో బీకే మాట్లాడుతూ రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్‌ వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ పంట నష్టపరిహారం కేవలం రూ.2.61 కోట్లు విడుదల చేశారని, 30 మండలాలకు మొండి చేయి చూపారన్నారు. పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం నడుస్తోందని, మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని, తాడిపత్రిలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. ఇలాగే రాక్షసపాలన కొనసాగితే అన్ని పార్టీలు కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టాలని రాష్ట్రపతిని కోరుతామన్నారు. సీ పీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ మాట్లాడుతూ రైతులను అదేపనిగా ఇబ్బందులపాలు చేస్తే బోగిమంటల్లో ప్రభు త్వా న్ని కాల్చడానికి వారు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు జీవీపీ నాయుడు, కొల్లకుంట అంజనప్ప, రామసుబ్బమ్మ, రొద్దం నరసిం హులు, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణ, భానుకీర్తి, సిద్దలింగప్ప, నాయకు లు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T06:19:15+05:30 IST