-
-
Home » Andhra Pradesh » Ananthapuram » atp road clear for dmv peoples
-
ఊరు ఏకమైంది.. ఏరు చిన్నబోయింది..
ABN , First Publish Date - 2020-12-30T06:16:25+05:30 IST
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఊరు ఏకమైంది. చిత్రావతి ఏరు చిన్నబోయింది.

కదిలొచ్చిన కనంపల్లి వాసులు
చిత్రావతి నదిలో తాత్కాలిక రహదారి ఏర్పాటుకు చర్యలు
ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల్లో చలనం రావాలంటూ చురకలు
ధర్మవరంరూరల్, డిసెంబరు 29: ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఊరు ఏకమైంది. చిత్రావతి ఏరు చిన్నబోయింది. మండలంలోని కనంపల్లికి చిత్రావతి నదిపై వెళ్లేందుకు రహదారి లేక దశాబ్దాలుగా గ్రామస్థులు పడుతున్న కష్టాలను ‘ఒక ఊరి చిత్రవ్యథ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం కళ్లకు కట్టింది. దీంతో కనంపల్లి, పోతులనాగేపల్లి వాసులు కదిలొచ్చారు. చి త్రావతి నదిపై తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఏకంగా 50 మంది యువకులు, పెద్దలు, చిత్రావతి నదిలో ఎక్స్‌కవేటర్‌తో సిమెంటు తూము లు వేసి, పెద్దపెద్ద రాళ్లు అమర్చి మట్టివేసుకుని తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి రహదారిని గతంలో ఏర్పాటు చేశారనీ, భారీ వర్షాలకు గతేడాది కొట్టుకుపోయిందని వారు తెలిపారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి, చిత్రావతి నదిపై శాశ్వత బ్రిడ్జిని ఏర్పాటుచేసి, తమ కష్టాలను తీర్చాలని కనంపల్లి వాసులు కోరుతున్నారు.
